Amazon Layoffs: భారతీయ ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్, నవంబర్ 30 లోపు కంపెనీని వదిలేయాలని ఆదేశాలు, కంపెనీ అందించే బెనిఫిట్స్ తీసుకుని రిజైన్ చేయాలని సూచన

Amazon Layoffs: భారతీయ ఉద్యోగులకు అమెజాన్ భారీ షాక్, నవంబర్ 30 లోపు కంపెనీని వదిలేయాలని ఆదేశాలు, కంపెనీ అందించే బెనిఫిట్స్ తీసుకుని రిజైన్ చేయాలని సూచన
Amazon. (Photo Credits: Twitter/ Amazon)

New Delhi, Nov 24: ఇండియాలో పని చేస్తున్న ఉద్యోగులకు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) షాకిచ్చింది. ఈ నెల 30వ తేదీలోపు (November 30) స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని భారత్ లో పనిచేస్తున్న కొంత మంది  ఉద్యోగులను కోరింది.

తద్వారా కంపెనీ అందించే బెనిఫిట్స్ తో (leave with monetary benefits) అమెజాన్ ను వారు విడిచి వెళ్లిపోవాలని చెప్పింది. ఇదిలా ఉంటే అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా ఈ వారం దాదాపు పది వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఇదే కాకుండా భవిష్యత్తులో మరింత మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చాలామంది ఉద్యోగులకు ఇ–మెయిల్‌ పంపించిట్టు వెల్లడించింది.

తాజాగా కంపెనీలో పని చేస్తున్న అనేక మంది భారతీయ ఉద్యోగులు (Indian employees) స్వచ్ఛంద విభజన కార్యక్రమం (వీఎస్పీ) కోసం ప్లాన్ చేస్తున్నారు. కంపెనీ వారి ఒప్పందాన్ని ముగించే బదులు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా అమెజాన్ కోరుతోంది. అమెజాన్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్‌లో ఎల్1 నుంచి ఎల్7 బ్యాండ్‌లో పని చేస్తున్న కొంతమంది భారతీయ ఉద్యోగులు కంపెనీ స్వచ్ఛంద విభజన కార్యక్రమానికి అర్హులు అంటూ ఒక నోటీసు అందుకున్నారు.

గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్, 10 వేల మంది ఉద్యోగులను తొలగించే యోచనలో కంపెనీ, పేలవమైన పనితీరు ప్రదర్శించే వారిని బయటకు పంపే ప్రయత్నం

దీన్ని కోరే ఉద్యోగులు ఈనెల 30వ తేదీ లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోపు తమ సమ్మతి తెలిపే ఉద్యోగులు కంపెనీ అందించే ఇతర ప్రయోజనాలు పొందేందుకు కూడా అర్హులు అవుతారు. భారత కాలమానం ప్రకారం నవంబర్ 30వ తేదీ ఉదయం 6.30 గంటలలోపు స్మార్ట్ ఫారమ్‌ల వచ్చే వీఎస్పీ దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తామని అమెజాన్ స్పష్టం చేసింది. ఉద్యోగులు వీఎస్పీపై సంతకం చేసినట్లయితే వారు 22 వారాల వరకు మూల వేతనం పొందేందుకు అర్హులు.

అలాగే ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒక వారం మూల వేతనం (సమీప 6 నెలల వరకు) అందుకుంటారు. ఇన్సూరెన్స్ బెనిఫిట్ పాలసీ ప్రకారం 6 నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజీని లేదా దాని బదులుగా సమానమైన బీమా ప్రీమియం మొత్తాన్ని పొందేందుకు ఉద్యోగులు అర్హులు అవుతారు.

(The above story first appeared on LatestLY on Nov 24, 2022 01:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).