తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్యకు పాల్పడ్డాడు. డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డును అర్ధరాత్రి రెండు గంటలకు చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించాడు హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్. ఫోన్లో దీన్నిమహిళా హోంగార్డు చిత్రీకరించింది. బాధిత హోంగార్డ్ భర్తతో కలిసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఆదేశాలతో ఎఫ్ఆర్ నమోదు చేసి కానిస్టేబుల్ ను సస్పెండ్ చేశారు అధికారులు.
ఈ నెల 8వ తేదీన బాధిత మహిళ బొమ్మూరు స్టేషన్లో నైట్ డ్యూటీలో ఉన్నారు. ఆమెతో పాటు ఓ మహిళా పీసీ కూడా విధుల్లో ఉండగా.. ఆమె నిద్రలోకి జారుకున్నారు. హోంగార్డు ఉన్న బాధిత మహిళ తన ఫోన్ చూసుకుంటూ ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటాక హెడ్ కానిస్టేబుల్ సాగర్ ప్రసాద్ అక్కడికి వచ్చాడు. ఒంటరిగా ఉన్న ఆమెతో ప్రసాద్ అసభ్యకరంగా మాట్లాడి, చెయ్యి పట్టుకునేందుకు యత్నించాడు. అయితే ఈ చర్యను బాధిత మహిళ ప్రతిఘటించారు.
head-constable-misbehaves-with-female-home-guard in Bommuru Police Station
👉తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బొమ్మూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ దుశ్చర్య....
👉డ్యూటీలో ఉన్న మహిళా హోంగార్డును అర్ధరాత్రి రెండు గంటలకు చెయ్యి పట్టుకుని అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్... ఫోన్లో చిత్రీకరించిన మహిళా హోంగార్డు
👉బాధిత హోంగార్డ్ భర్తతో కలిసి… pic.twitter.com/ulNB0tTEff
— ChotaNews (@ChotaNewsTelugu) December 13, 2024
హెడ్ కానిస్టేబుల్ సాగర్ ప్రసాద్ అసభ్య ప్రవర్తనను ఫోన్లో చిత్రీకరించేందుకు ఆమె ప్రయత్నించారు. దీంతో సాగర్ ప్రసాద్ వెటనే స్టేషన్ నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలు తన భర్తతో బుధవారం రోజున జిల్లా పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ప్రసాద్‌ను సస్పెండ్ చేసినట్లు సీఐ చెప్పారు.