Hyderabad, Dec 13: హైదరాబాద్ (Hyderabad) లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో యూపీకి (UP) చెందిన సిరాజ్ అనే వ్యక్తి భార్య, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడి మరో కుమారుడు ఎంతో చాకచక్యంగా తండ్రి నుంచి తప్పించుకుని పారిపోయాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యూపీకి చెందిన సిరాజ్ అనే వ్యక్తి గత ఆరేళ్లుగా నగరంలోని పాతబస్తీ గాజుల తయారీలో పనిచేస్తున్నాడు. ఇటీవల కుటుంబాన్ని హైదరాబాద్ తీసుకొచ్చాడు.
Video:
బేగంబజార్ లో దారుణం....భార్య, చిన్న కుమారుడిని చంపి భర్త ఆత్మహత్య
భార్య గొంతు కోసి, చిన్న కుమారుడి గొంతు నులిమి చంపిన భర్త సిరాజ్
అనంతరం తాను ఉరేసుకొని ఆత్మహత్య
ఈ ఘటన చూసి భయంతో పారిపోయిన పెద్ద కుమారుడు
బతుకు దెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన సిరాజ్ కుటుంబం… pic.twitter.com/rv8F9H497X
— BIG TV Breaking News (@bigtvtelugu) December 13, 2024
రెండు రోజుల్లోనే మారిన పరిస్థితి
హైదరాబాద్ లో కాపురం పెట్టిన రెండు రోజుల్లోనే భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున భార్యను గొంతు కోసి చంపేసిన సిరాజ్ చిన్న కుమారుడు హైదర్ ను గొంతు నులిమి చంపుతుండగా లేచిన పెద్ద కుమారుడు భయంతో కేకలు వేస్తూ ఇంటి నుంచి బయటకు పరుగులు తీశాడు. అతని అరుపులతో అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్యా కుమారుడిని చంపిన తర్వాత సిరాజ్ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలం చేరుకునే సరికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.