Vijayawada, Dec 13: విజయవాడలో (Vijayawada) నేడు స్వర్ణాంధ్ర విజన్-2047 (Swarnandhra Vision 2047) కార్యక్రమాన్ని ఏపీ సర్కారు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. నగరంలోని బందర్ రోడ్డుపై బస్సులు, ఆటోలకు అనుమతి లేదని వెల్లడించారు. స్వర్ణాంధ్ర విజన్-2047 కార్యక్రమానికి వచ్చే వాహనాలకు మాత్రమే ఆ మార్గంలో అనుమతిస్తామని గుర్తు చేశారు.
సహకరించాలని విజ్ఞప్తి
ఆంక్షలు విధించిన నేపథ్యంలో విజయవాడ ప్రజలు తమకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అందరూ ఉదయం 8 గంటల లోపు ఆఫీసులు, దుకాణాలకు వెళ్లాలని సూచించారు. ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.