Vijayawada, Dec 13: తెలంగాణను (Telangana) చలిపులి (Coldwaves) వణికిస్తోంది. తీవ్రమైన శీతల గాలులు జనాల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. డిసెంబర్ 14 వరకు ఇలాంటి వాతావరణమే కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని అత్యధిక జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని అంచనా వేసింది. చలిగాలులు తీవ్రంగా ఉండనుండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఐఎండీ సూచించింది. ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం సమయాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని, ప్రభావిత ప్రాంతాల్లోని జనాలు శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే దుస్తులు ధరించాలని, ఆరోగ్యంపట్ల జాగ్రత్తవహించాలని సూచించింది.
ఈ జిల్లాల్లో పడిపోనున్న ఉష్ణోగ్రతలు
ఆదిలాబాద్, కుమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో శనివారం ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 5 డిగ్రీల సెల్సియస్ స్థాయికి పడిపోవచ్చని భారత వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 వరకు ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా వేసింది. పొగమంచుతో కూడిన వాతావరణం ఉంటుందని అప్రమత్తం చేసింది.