Andhra Pradesh Shocker: పల్నాడులో దారుణం, చంపొద్దు నాన్నా అంటూ కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి, కాల్వలోకి తోసి తను మాత్రం ఈదుకుంటూ..
పల్నాడు జిల్లా ఈపూరు మండలం పనికుంట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మ అప్పుల బాధతో కన్న కూతుళ్ళని చంపాడు. వృత్తిరీత్యా ఓ దినపత్రికలో విలేఖరి అయిన నాగాంజనేయ శర్మ భార్య అనారోగ్యంతో మంచం పట్టింది.. ఇతనికి ఇద్దరు కూతుళ్లు యామిని(10), కావ్య(7) ఉన్నారు.
Palndau, Nov 29: పల్నాడు జిల్లా ఈపూరు మండలం పనికుంట గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తురుమెళ్ల వెంకట నాగాంజనేయ శర్మ అప్పుల బాధతో కన్న కూతుళ్ళని చంపాడు. వృత్తిరీత్యా ఓ దినపత్రికలో విలేఖరి అయిన నాగాంజనేయ శర్మ భార్య అనారోగ్యంతో మంచం పట్టింది.. ఇతనికి ఇద్దరు కూతుళ్లు యామిని(10), కావ్య(7) ఉన్నారు.
అయితే నాగాంజనేయ శర్మ విపరీతంగా అప్పులు చేయడంతో అప్పులిచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువైంది.. దీంతో మంచం పట్టిన భార్యను వదిలేసి, ఇద్దరు కూతుళ్ళతో కలిసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాడు. ఇద్దరు పిల్లలను ఆసుపత్రిలో చూపించాలంటూ బైక్ పై ఎక్కించుకొని, ముప్పాళ్ల కాల్వలోకి బైక్ ను తీసుకెళ్ళాడు. దీంతో ఊపిరాడక చిన్న కూతురు చనిపోయింది.
దారుణం, వివాహేతర సంబంధం మోజులో భర్తను హత్య చేసిన భార్య , నాగర్ కర్నూల్ జిల్లాలో ఘటన
ఈత వచ్చిన నాగాంజనేయ శర్మ మునగకపోవడంతో పెద్ద కూతురు తండ్రి కాలు పట్టుకొని "నాన్న, మిమ్మల్ని చంపొద్దు.. నాన్నా.. నీ కాళ్లు పట్టుకుంటా నాన్న.. నీళ్లలో మునిగిపోతున్నాం నాన్న, మమ్మల్ని బయటికి తీయి నాన్నా" అంటూ బ్రతిమిలాడింది. కానీ ఏమాత్రం చలించని నాగాంజనేయ శర్మ కాలు పట్టుకున్న బిడ్డను వదిలించుకున్నారు. దీంతో పెద్ద కూతురు కూడా మునిగి చనిపోయింది.
నాగాంజనేయ శర్మకు ప్రాణం మీద తీపి పుట్టిందేమో, పిల్లలని చంపేసి ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాడు.. ఇదంతా చూసిన పాల వాహనం డ్రైవర్ సమాచారం ఇవ్వగా, పోలీసులు నాగాంజనేయ శర్మను అదుపులోకి తీసుకొని, కాలువలో నుండి పిల్లల మృతదేహాలు బయటకి తీశారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

