Baghpat ‘Laddu Mahotsav’ Tragedy: విషాదంగా మారిన బాగ్‌పత్ లడ్డూ మహోత్సవం, చెక్క వేదిక కూలి ఏడుగురు మృతి, 60 మందికి తీవ్ర గాయాలు
బదౌత్‌లో మంగళవారం జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో చెక్క నిర్మాణం కూలిపోవడంతో ఏడుగురు మరణించగా, సుమారు 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Baghpat, Jan 27: బదౌత్‌లో మంగళవారం జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో చెక్క నిర్మాణం కూలిపోవడంతో ఏడుగురు మరణించగా, సుమారు 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. బాగ్‌పత్ జిల్లాలోని బరౌత్ నగరంలోని గాంధీ రోడ్‌లోని శ్రీ దిగంబర్ జైన్ డిగ్రీ కళాశాల మైదానంలో భగవాన్ ఆదినాథుని 'అభిషేక' కార్యక్రమం సందర్భంగా ఉదయం 8 గంటలకు ఈ సంఘటన జరిగింది.శ్రీ 1008 ఆదినాథ్ భక్తాంబర్ ప్రచార్ ఆధ్వర్యంలో జైన సంఘం మోక్ష కల్యాణక్ నిర్వాణ మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బదౌత్‌లోని జైన్ కమ్మూనిటీ ఇవాళ ‘లడ్డూ మహోత్సవ్’ (Laddoo Mahotsav)ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్‌తో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆదినాథుడి ఆలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తుల కోసం నిర్వాహకులు చెక్కతో వేదికను నిర్మించారు.
అయితే అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో బరువు ఎక్కువై వేదిక ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకూ ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన వారిలో 20 మంది ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా, 39 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాన్‌స్తంభ్ కాంప్లెక్స్‌లో నిర్మించిన 65 అడుగుల తాత్కాలిక స్టేజీ చెక్క మెట్లు విరిగిపోవడంతో వేదికపై ఉన్న భక్తులు కింద పడిపోయారని పోలీసులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jan 28, 2025 05:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

