Bengaluru Shocker: ఇదేం పాడు బుద్ధి, అమ్మాయిలు బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా వీడియోలు, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన బెంగుళూరు పోలీసులు
బెంగుళూరులోని మహాదేవపురలోని హోడిలో పీజీలో ఉంటున్న యువతులను రహస్యంగా ఫొటోలు తీస్తున్న చిక్కబళ్లాపురకు చెందిన ఆశోక్ అనే కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Man Films Women Taking Bath In Mahadevpura PG: బెంగుళూరులోని మహాదేవపురలోని హోడిలో పీజీలో ఉంటున్న యువతులను రహస్యంగా ఫొటోలు తీస్తున్న చిక్కబళ్లాపురకు చెందిన ఆశోక్ అనే కామాంధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కామాంధుడు ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న మహిళలు బాత్‌రూమ్‌లో స్నానం చేస్తుండగా ఒక వ్యక్తి రహస్యంగా వీడియోలు రికార్డ్ చేశాడు.
అతడ్ని పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. మహదేవ్‌పురా ప్రాంతంలో పలు పేయింగ్ గెస్ట్ హాస్టల్స్ (PG facility) ఉన్నాయి. అశోక్ అనే వ్యక్తి మెన్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఎదురుగా ఉన్న ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటున్న మహిళలపై అతడి కన్నుపడింది. వారు స్నానం చేసేటప్పుడు బాత్‌రూమ్ వెంటిలేషన్ వద్ద ఉన్న రంధ్రం ద్వారా రహస్యంగా వీడియోలు రికార్డు చేస్తున్నాడు. ఈ నెల 21 స్థానికులు అతడ్ని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు.
నిందితుడు తన సమీపంలోని పీజీల్లోకి చొరబడి యువతులు స్నానాల చేస్తుండగా రహస్యంగా ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు. ఇటీవల ఓ పీజీలో రహస్యంగా వీడియో తీస్తుండగా దీనిని గమనించిన ఓ యువతి చుట్టు పక్కన ఉండే వారిని అప్రమత్తం చేయడంతో యువకుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతని ఫోన్‌ను పరిశీలించగా యువతులు స్నానాలు చేసే దృశ్యాలు కనిపించాయి. గత మూడు, నాలుగు నెలలుగా రహస్యంగా ఈ వీడియోలు రికార్డ్ చేస్తున్నట్లు గ్రహించారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అతడ్ని అరెస్ట్ చేశారు.
(The above story first appeared on LatestLY on Jun 26, 2023 07:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

