Bengaluru Shocker: యువతిపై ప్రియుడు లైంగికదాడి, ఆ దారుణాన్ని వీడియో తీసిన స్నేహితుడు, ఆ వీడియోతో బెదిరించి 8 మంది బాలికపై సామూహిక అత్యాచారం, ఏడుమందిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు

బెంగళూరులోని యలహంకలో 16 ఏళ్ల మైనర్ బాలికపై (16-year-old Girl in Yelahanka) సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ (Seven arrested for gang raping) చేశారు. పరారీలో ఉన్న మరోక నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

Bengaluru Shocker: యువతిపై ప్రియుడు లైంగికదాడి, ఆ దారుణాన్ని వీడియో తీసిన స్నేహితుడు, ఆ వీడియోతో బెదిరించి 8 మంది బాలికపై సామూహిక అత్యాచారం, ఏడుమందిని అరెస్ట్ చేసిన బెంగుళూరు పోలీసులు
Image Used For Representational Purpose Only | (Photo Credits: Newsplate)

Yelahanka, April 11: బెంగళూరులోని యలహంకలో 16 ఏళ్ల మైనర్ బాలికపై (16-year-old Girl in Yelahanka) సామూహిక అత్యాచారం చేసిన ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ (Seven arrested for gang raping) చేశారు. పరారీలో ఉన్న మరోక నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. య‌ల‌హంక‌లో ఈ దారుణం వెలుగుచూడ‌గా ఏప్రిల్ 5న పోలీసుల‌కు ఫిర్యాదు అందింది. బాలిక 25 ఏండ్ల వ్య‌క్తిని ప్రేమిస్తుండ‌గా అత‌డు బాధితురాలిని య‌ల‌హంక‌లోని త‌న ఇంటికి తీసుకువెళ్లి లైంగిక వేధింపుల‌కు గురిచేశాడు.

మొత్తం ఘ‌ట‌న‌ను నిందితుడి స్నేహితుడు వీడియో తీశాడు. నిందితులు ఇద్ద‌రూ ఈ వీడియోను త‌మ స్నేహితుల‌కు షేర్ చేయ‌గా వారు వీడియోను వైర‌ల్ చేస్తామ‌ని బెదిరించి (blackmailing ) సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. బాలిక ఇంటికి వ‌చ్చి ఏడుస్తూ కుటుంబ‌స‌భ్యుల‌కు తెల‌ప‌డంతో ఈ విష‌యం వెలుగుచూసింది. ఈ కేసులో బాలిక ప్రియుడు ప్ర‌ధాన నిందితుడ‌ని, మ‌రికొంద‌రు నిందితుల‌కూ ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉందా అనే కోణంలో ద‌ర్యాప్తు సాగిస్తున్నామ‌ని యలహంక పోలీసులు తెలిపారు.

వృద్ధుడికి కూతురును ఎరవేసిన తల్లి, రూంలో కూతురితో బాధితుడు నగ్నంగా ఉన్న సమయంలో పోలీసులు ఎంటర్, అడిగినంత డబ్బులు ఇవ్వాలని బెదిరింపులు

వీడియోలు షేర్ చేసిన నిందితుల మొబైల్ ఫోన్‌ల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని, కంటెంట్‌ను మ‌రికొంద‌రికీ షేర్ చేశారా అనే విష‌యం తెలుసుకునేందుకు ఫోన్‌ల‌ను సైబ‌ర్ పోలీసుల‌కు అంద‌చేస్తామ‌ని చెప్పారు. పోక్సో స‌హా ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేసిన య‌ల‌హంక పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

(The above story first appeared on LatestLY on Apr 11, 2022 06:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).