Lucknow, April 6: యూపీలోని లక్నోలో వృద్ధుడిపై వలపు వల విసిరిన తల్లీకూతుళ్లు మరో ఇద్దరి సాయంతో బాధితుడి నుంచి రూ. 3 లక్షలు కాజేసిన ఘటన ( duping elderly man in Lucknow) వెలుగుచూసింది. లక్నో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితురాలు అర్చనా వాలియా లక్నోలోని రాజాజిపురం ప్రాంతంలో బాధితుడిని పరిచయం చేసుకుని ఆపై ఇద్దరూ మొబైల్ ఫోన్ నెంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు.
ఫోన్‌లో తరచూ మాట్లాడుకునే క్రమంలో అర్చన బాధితుడిని తమ ఇంటికి ఆహ్వానించింది. బాధితుడు ఆమె ఇంటికి వెళ్లగానే అర్చన కూతురు మున్‌మున్ కూడా అక్కడే ఉంది. తలుపు వేసిన అర్చనా వృద్ధుడితో సన్నిహితంగా మెలిగింది. అంతలోనే పోలీసులమని చెబుతూ ఇద్దరు వ్యక్తులు అక్కడకు చేరుకుని బాధితుడి అభ్యంతరకర వీడియో రికార్డు చేశారు. తమకు రూ. 5 లక్షలు ఇవ్వకుంటే వీడియోను వైరల్ చేస్తామని బెదిరించారు. రూ. 15 వేలు చెల్లించిన బాధితుడు ఆపై కొద్ది రోజుల్లో మరో 3 లక్షలు ముట్టచెప్పాడు.
నిందితులు వేధిస్తుండటంతో విసుగు చెందిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లీకూతుళ్లతో పాటు వారికి సహకరించిన ఇద్దరు వ్యక్తులను (Mother-daughter duo among 4 arrested) అరెస్ట్ చేశారు.