AI Chatbot (Credits: X)

Newyork, Oct 25: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) (AI) వినియోగం నేటి యువతకు ప్రమాదకరంగా మారింది అనడానికి మరో ఉదాహరణే ఈ ఘటన.  ఏఐ చాట్‌ బాట్‌ తో (AI Chatbot) ప్రేమలో పడిన 14 ఏళ్ల ఓ మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. దీంతో  అతడి తల్లి కోర్టుకెక్కింది. అసలేం జరిగిందంటే.. ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ సిరీస్‌ లోని క్యారెక్టర్‌ అయిన టార్గారియన్‌ పేరుతో సృష్టించిన ఈ చాట్‌ బాట్‌ కు సెవెల్‌ సెట్జెర్‌ అనే బాలుడు బానిసయ్యాడు. దానితో మాట్లాడిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడి ఆత్మహత్యకు చాట్‌ బాటే కారణమని..దాని సృష్టికర్త కంపెనీతోపాటు గూగుల్‌ మాతృసంస్థ ఆల్ఫాబెట్‌ పై ఫ్లోరిడా ఫెడరల్‌ కోర్టులో అతడి తల్లి దావా వేశారు. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.

ట్రాన్స్‌ఫార్మర్ పక్కన పార్కింగ్...చెలరేగిన మంటలు, దగ్దమైన మూడు బస్సులు...వీడియో ఇదిగో

దావాలో తల్లి ఆరోపణలు ఇవే..

చాట్‌ బాట్‌ తన కుమారుడిని మానవరూప, హైపర్‌ సెక్యువలైజ్డ్‌ గా భయపెడుతూ ఏమార్చిందని తల్లి మేగాన్‌ తన దావాలో ఆరోపించారు. చాట్‌ బాట్‌ ‘డేనెరిస్‌ టార్గారియన్‌’తో సంభాషణ తర్వాతే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు మండిపడ్డారు.

మెదక్ జిల్లాలోని తూప్రాన్‌ లో తెల్లవారుజామున కారు షెడ్డులో అగ్నిప్రమాదం.. 8 కార్లు దగ్ధం (వీడియో)