Chennai, April 5: చెన్నైలో విద్యార్ధులతో మహిళా టీచర్ గ్రూప్ సెక్స్ వీడియో (Sex scandal in Tamil Nadu) వైరల్ అవుతోంది. ఓ మహిళా స్కూల్ టీచర్, విద్యార్థులతో కూడిన గ్రూప్ సెక్స్ వీడియోపై తమిళనాడు సైబర్ సెల్ దర్యాప్తు (probe underway) ప్రారంభించింది. మహిళ ప్రియుడు వ్యాపారవేత్త ఈ వీడియోను చిత్రీకరించి తన స్నేహితులలో కొందరికి షేర్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ వీడియోను డబ్బు కోసం అంతర్జాతీయ అశ్లీల సైట్లలో అప్‌లోడ్ చేశారా లేక కొద్దిమంది మధ్య షేర్ అయిందా అనే కోణంలో తమిళనాడు సైబర్ పోలీసులు విచారిస్తున్నారు.
ఈ కేసుకు సంబంధించి మధురైలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మహిళ (42)తో పాటు ఆమె ప్రియుడు (39)ని పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ సెల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భర్త నుంచి విడిపోయిన ఓ మహిళ.. 2010లో వ్యాపారవేత్తకు దగ్గరైంది. వీరి పరిచయం ఆపై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇక మహిళా టీచర్ ఇటీవల 16 ఏండ్ల వయసున్న ముగ్గురు విద్యార్ధులను (female school teacher, her students) తన ఇంటికి పిలిపించి వారితో శృంగారంలో పాల్గొంది. కాగా ఈ వీడియోను తాను తన స్నేహితులలలో కొద్ది మందికి షేర్ చేసినట్లుగా దర్యాప్తులో వ్యాపారి అంగీకరించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో వీడియోను వ్యాప్తి చేసిన మరికొందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తామని వారు (Tamil Nadu Cyber Cell) చెప్పారు.
అశ్లీల కంటెంట్‌ను షేర్ చేసిన వారందరిపై కఠినంగా వ్యవహరించాలని డీజీపీ కార్యాలయం నుండి కఠినమైన ఆదేశాలు ఉన్నాయని మధురై సైబర్ సెల్‌లోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మైనర్ బాలురు ఆమెపై ఫిర్యాదు చేయడంతో మదురై సౌత్ ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇప్పటికే మహిళ, ప్రియుడిపై కేసు నమోదు చేసింది. వీరిద్దరిపై పోక్సో చట్టంలోని సెక్షన్ 5(1),5(n) r/w 6, IPC సెక్షన్లు 292(A), 506, మరియు IT చట్టంలోని సెక్షన్లు 67 (A) మరియు 67 (B) కింద అభియోగాలు మోపారు. మైనర్ బాలురపై లైంగిక వేధింపులు, అశ్లీల కంటెంట్‌ను ప్రసారం చేయడం మరియు నేరపూరిత బెదిరింపు ఆరోపణలు కింద కేసులు నమోదయ్యాయి.