Jangaon, Sep 27: జనగామలోని (Jangaon) ఏబీవీ కాలేజ్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తున్నది. ఈ ఘటనలో 15 మంది ఇంటర్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో హస్టల్ కు ఆర్ఎంపీ వైద్యుడిని రప్పించిన కళాశాల యాజమాన్యం విద్యార్థులకు రహస్యంగా చికిత్స అందించారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయాన్ని వారి తల్లిదండ్రులకు కూడా తెలియజేయలేదు. అయితే, ఆర్ఎంపీ వైద్యుడు చికిత్స చేసినప్పటికీ నలుగురి విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి మాత్రం మెరుగుపడలేదు. దీంతో ఒకింత ఆందోళనకు గురైన సిబ్బంది సదరు విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు.
నేడు తిరుమలకు జగన్.. తిరుపతిలో విస్తృతంగా వాహనాల తనిఖీలు.. పోలీస్ యాక్ట్ 30 అమలు
Here's Video:
జనగామలోని ఏబీవీ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్
15 మంది ఇంటర్ విద్యార్థులకు అస్వస్థత
విద్యార్థులకు హస్టల్లో ఆర్ఎంపీ వైద్యుడితో రహస్యంగా చికిత్స
నలుగురి పరిస్థితి విషమించడంతో జిల్లా ఆస్పత్రికి తరలింపు
ఫుడ్ పాయిజన్పై మౌనం వహిస్తున్న కళాశాల యాజమాన్యం#Janagaon… pic.twitter.com/UEKqyOdbSJ
— BIG TV Breaking News (@bigtvtelugu) September 27, 2024
అలా బయటకు..
ఎప్పుడైతే, విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించే వ్యవహారం వెలుగులోకి వచ్చిందో హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగినట్టు తెలియవచ్చింది. దీంతో హాస్పిటల్ వద్ద గందరగోళం ఏర్పడింది. అయితే, ఫుడ్ పాయిజన్ కళాశాల యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయకుండా మౌనంగా ఉండటం గమనార్హం.