Bihar Shocker: పాటలు పాడుతుందని భార్యను కత్తితో పొడిచి చంపేసిన భర్త, అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు
బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సివాన్ జిల్లాలో రోడ్డు మీదకొచ్చి పాటలు పాడుతున్నందుకు ట్రాన్స్‌జెండర్ భార్యను ఓ భర్త కత్తితో ( Man brutally stabs transgender wife) పొడిచాడు.
Patna, Sep 6: బీహార్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సివాన్ జిల్లాలో రోడ్డు మీదకొచ్చి పాటలు పాడుతున్నందుకు ట్రాన్స్‌జెండర్ భార్యను ఓ భర్త కత్తితో ( Man brutally stabs transgender wife) పొడిచాడు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జిల్లాలో మూడేళ్ల క్రితం 2019లో ఆనంద్ కుమార్ చాప్రా జిల్లాలోని జంతా బజార్ ప్రాంతంలో డ్యాన్స్ పార్టీని నిర్వహించేవాడు. ఈ సమయంలో, ఆనంద్ చాప్రాలోని సెమారియాలో నివసిస్తున్న రియా రాజ్ అనే ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమలో పడ్డాడు. అనంతరం కోర్టులో ఇద్దరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు.
క్రమక్రమంగా, ఆనంద్ అతని లింగమార్పిడి భార్య రియా రాజ్ మధ్య ఆమె లైంగికతపై విభేదాలు వచ్చాయి. రియా రాజ్ తన ఇతర ట్రాన్స్ సహచరులతో కలిసి వేడుక పాటలు పాడటానికి వెళ్ళేది. ఇది ఆమె భర్త ఆనంద్‌కు అస్సలు ఇష్టం ఉండదు. అతను ఈ పనిని విడిచిపెట్టమని ఆమెను పదేపదే బలవంతం చేశాడు. ఆమెను ఆ కంపెనీ నుంచి దూరం చేసేందుకు ఆనంద్ ఆమెను ఢిల్లీకి తీసుకెళ్లాడు. అయితే, వారు అక్కడ ఎక్కువ కాలం జీవించలేక పోవడంతో ఆమె అక్కడి నుంచి తిరిగి గ్రామానికి పారిపోయింది. అనంతరం మిగతా ట్రాన్స్‌జెండర్లతో కలిసి ఇళ్లకు వెళ్లడంతోపాటు బహిరంగంగా పాటలు (singing celebratory songs in public) పాడసాగింది.
దీంతో ఆగ్రహించిన భర్త ఆనంద్ ట్రాన్స్‌జెండర్ భార్య రియాను పలుసార్లు కొట్టాడు. అయినప్పటికీ తీరు మారకపోవడంతో కత్తితో పొట్టలో మూడుసార్లు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రియాను స్థానికులు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆనంద్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Sep 06, 2022 06:53 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

