Bihar Shocker: కూతురు ప్రేమ పెళ్లితో పగబట్టిన తండ్రి, రూ 4 ల‌క్ష‌ల‌తో కాంట్రాక్టు కిల్ల‌ర్ల‌తో దారుణంగా అల్లుడుని చంపించిన మామ, పాట్నాలో దారుణ ఘటన

బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందనే కక్షతో.. తండ్రి కిరాయి హంతుకుల‌తో ఒప్పందం చేసుకుని అల్లుడిని క‌డ‌తేర్చాడు.

Bihar Shocker: కూతురు ప్రేమ పెళ్లితో పగబట్టిన తండ్రి, రూ 4 ల‌క్ష‌ల‌తో కాంట్రాక్టు కిల్ల‌ర్ల‌తో దారుణంగా అల్లుడుని చంపించిన మామ, పాట్నాలో దారుణ ఘటన
Representational Image. (photo credit- IANS)

Patna, July 22: బీహార్ రాజధాని పాట్నాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుందనే కక్షతో.. తండ్రి కిరాయి హంతుకుల‌తో ఒప్పందం చేసుకుని అల్లుడిని క‌డ‌తేర్చాడు. ప‌ట్నాలోని బ‌ర్ ప్రాంతానికి స‌మీపంలోని స‌విత సినిమా హాల్ వ‌ద్ద‌ జులై 12న గుర్తుతెలియ‌ని వ్య‌క్తి కాల్పులు (kill son-in-law) జ‌ర‌ప‌డంతో అంకిత్ కుమార్ మ‌ర‌ణించాడు. అల్లుడిని కిరాత‌కంగా చంపించినందుకు ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌ధాన సూత్ర‌ధారి అయిన మామ‌ను అరెస్ట్ చేశారు.

ఈ దారుణ ఘ‌ట‌న‌కు సంబంధించి ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేశామ‌ని బ‌ర్ ఏసీపీ అర్వింద్ కుమార్ సింగ్ వెల్ల‌డించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మృతుడు అంకిత్ కుమార్ ట‌ప్పు సింగ్ కూతురిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ట‌ప్పు సింగ్ ఇష్టానికి వ్య‌తిరేకంగా జ‌ర‌గ‌డంతో అల్లుడిపై కోపం పెంచుకున్నాడు. త‌న ఇష్టానికి వ్య‌తిరేకంగా త‌న కూతురిని అంకిత్ పెండ్లి చేసుకోవ‌డంతో ( love marriage in Patna) ఎలాగైనా అత‌డిని అంత‌మొందించాల‌ని నిర్ణ‌యించుకున్న సింగ్ త‌న అల్లుడిని చంపాల‌ని రూ 4 ల‌క్ష‌ల‌తో కాంట్రాక్టు కిల్ల‌ర్ల‌తో ఒప్పందం (Man hires shooters) చేసుకున్నాడు.

ఒకరిని ప్రేమించి మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు, అయితే ప్రియురాలిని మరచిపోలేక ఆమె తల నరికి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు , కర్ణాటకలో దారుణ ఘటన

ఒప్పందంలో భాగంగా త‌మ‌కు సింగ్ రూ 60,000 అడ్వాన్స్‌గా చెల్లించాడ‌ని, మిగ‌తా మొత్తం హ‌త్యానంత‌రం ఇస్తాన‌ని హామీ ఇచ్చాడ‌ని ప‌ట్టుబ‌డిన షూట‌ర్ తెలిపారు. అంకిత్‌ను కాల్చిచంపేందుకు అనువైన స‌మ‌యం కోసం తాము మృతుడి షెడ్యూల్‌ను ట్రాక్ చేశామ‌ని నిందితులు చెప్పారు.

(The above story first appeared on LatestLY on Jul 22, 2022 06:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).