Bihar Shocker: ఇదేమి ట్విస్ట్, భర్తతో కాపురం బోర్ కొట్టి అతని చెల్లెలిని పెళ్లి చేసుకున్న భార్య, ఆమెతో కాపురం చేసేందుకు లింగమార్పిడికి రెడీ, అత్తమామలు మందలించడంతో వారిపై కేసు పెట్టిన మహిళ

బిహార్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ వివాహిత పెళ్లయిన పదేళ్ల తరువాత ఉన్నట్టుండి భర్త చెల్లినే పెళ్లి (Woman 'marries' husband's sister) చేసుకుంది.ఆమహిళ కూడా తన మరదలితో కలిసి భార్యభర్తల్లా జీవిస్తున్నారు. దీనికి ఆమె భర్త సైతం అడ్డు చెప్పలేదంటే ఇంకా ఆశ్చర్యపరిచే అంశం.

Bihar Shocker: ఇదేమి ట్విస్ట్, భర్తతో కాపురం బోర్ కొట్టి అతని చెల్లెలిని పెళ్లి చేసుకున్న భార్య, ఆమెతో కాపురం చేసేందుకు లింగమార్పిడికి రెడీ, అత్తమామలు మందలించడంతో వారిపై కేసు పెట్టిన మహిళ
Representational Image | (Photo Credits: IANS)

Patna, Feb 22: బిహార్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ వివాహిత పెళ్లయిన పదేళ్ల తరువాత ఉన్నట్టుండి భర్త చెల్లినే పెళ్లి (Woman 'marries' husband's sister) చేసుకుంది.ఆమహిళ కూడా తన మరదలితో కలిసి భార్యభర్తల్లా జీవిస్తున్నారు. దీనికి ఆమె భర్త సైతం అడ్డు చెప్పలేదంటే ఇంకా ఆశ్చర్యపరిచే అంశం. ఈ ఘటనతో షాక్ తిన్న మహిళ అత్తమామలు ఆమె మరదలిని తీసుకు వెళ్లిపోయారు. దీంతో సదరు మహిళ వారిపై కిడ్నాప్‌ కేసు పెట్టింది.

షాకింగ్ ఘటన వివరాల్లోకెళ్తే..బిహార్‌లో రోసేరా బ్లాక్‌లో నివశిస్తున్న ప్రమోద్‌ దాస్‌, శుక్లా దేవి జంటకు పదేళ్ల క్రితం వివాహమై అయింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక రోజు భర్త చెల్లెలు 18 ఏళ్ల సోని దేవిని ఆ మహిల పెళ్లి చేసుకుంది. దీనికి భర్త వ్యతిరేకించకపోగా, తన భార్య సంతోషమే తన సంతోషం అని చెప్పుకొచ్చాడు.ఇక మహిళ తన పెళ్లి చేసుకున్న భర్త చెల్లెలుతో జీవించేందుకు మగవాడిగా మారాలని నిర్ణయించుకుంది.

పొద్దున పెళ్లి చేసుకున్నారు, రాత్రి కత్తులతో పొడుచుకున్నారు, పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు, ఛత్తీస్‌గఢ్‌లో విషాదకర ఘటన

అందుకు తగ్గట్టుగా వేషధారణ కూడా వేసుకుంది. ఇంకాస్త ముందుకెళ్లి మగవాడిలా మారేందుకు సర్జరీ చేసుకోవాలని రెడీ అయింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుబ సభ్యులు ఆమెను తీవ్రంగా మందలించారు. అయితే లింగ మార్పిడి గురించి కొన్ని వీడియోలను చూసిన తరువాత, ఆమె భయపడి ప్రణాళికను వదిలివేసింది.

ర్యాగింగ్ భూతమేనా, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని, పరిస్థితి విషమం

ఆ మహిళ అత్తమామలు సోని దేవిని (భాగస్వామిని) ఆమె నుంచి బలవంతంగా తీసుకువెళ్లిపోయారు. దీంతో శుక్లాదేవి అత్తమామలపై కిడ్నాప్‌ కేసు కూడా పెట్టింది. పైగా ప్రేమ ఎప్పుడూ ఎలా పుడుతుందో తెలియదు, ఇది మనసుకు సంబంధించింది అంటూ పోలీసులతో వాదిస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ కృష్ణ ప్రసాద్‌ ఇది కాస్త వివాదాస్పదమైన కేసు అని వాస్తవాలను వెలకితీసేలా సున్నితంగా దర్యాప్తు చేయాల్సి అంశం అని చెప్పారు.

(The above story first appeared on LatestLY on Feb 22, 2023 08:20 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).