 
                                                                 ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వివాహ రిసెప్షన్‌కు ముందు కొత్తగా పెళ్లయిన దంపతులు తమ ఇంట్లోని గదిలో కత్తిపోట్లతో మృతి (Newly-married couple found dead) చెందినట్లు పోలీసులు బుధవారం తెలిపారు.ఇద్దరి మధ్య గొడవ జరిగి భార్యను కత్తితో పొడిచి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.తిక్రాపారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్రిజ్‌నగర్‌లో మంగళవారం సాయంత్రం ఈ ఘటన (Chhattisgarh Shocker) చోటుచేసుకుందని అక్కడి పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
అస్లామ్ (24), కహ్కషా బానో (22) ఆదివారం వివాహం చేసుకున్నారు. వారి వివాహ రిసెప్షన్ మంగళవారం రాత్రి జరగాల్సి ఉంది. ఇద్దరూ తమ గదిలో ఫంక్షన్‌కు సిద్ధమవుతుండగా వరుడి తల్లి వధువు అరుపులు విని అక్కడికి చేరుకుంది. గది లోపలి నుండి లాక్ చేయబడింది. వారు స్పందించకపోవడంతో, కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూసారు. ఇద్దరూ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడి ఉన్నారని గమనించారు, ఆ తర్వాత వారు పోలీసులకు సమాచారం అందించారని అధికారి చెప్పాడు.
పోలీసులు తలుపులు పగులగొట్టి, కత్తిపోట్లతో ఉన్న వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం పంపించారు, సంఘటన స్థలం నుండి కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.భార్యాభర్తల మధ్య వాగ్వాదం చెలరేగడంతో ఆ వ్యక్తి భార్యపై కత్తితో దాడి చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.అయితే ఈ విషయంపై విచారణ జరుగుతోందని పోలీస్ అధికారి తెలిపారు.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
