Raja Singh Escapes: అమర్‌నాథ్ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రాజాసింగ్, స్పాట్ నుంచి వెనుదిరిగిన 10 నిమిషాల్లోనే ప్రమాదం, కుటుంబమంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపిన ఎమ్మెల్యే, ఘటనాస్థలంలో కొనసాగుతున్న రెస్క్యూ
అమర్‌నాథ్‌లో ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టితో అంతా అతలాకుతలమైంది. చాలామంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. అయితే మూడు రోజుల క్రితం అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అమర్ నాథ్ కుంభవృష్టి నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పింది.
Jammu Kashmir, July 08: అమర్‌నాథ్‌లో ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టితో అంతా అతలాకుతలమైంది. చాలామంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. అయితే మూడు రోజుల క్రితం అమర్ నాథ్ యాత్రకు వెళ్లిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు అమర్ నాథ్ కుంభవృష్టి నుంచి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఆయన వెళ్లిపోయిన పదినిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది. మూడురోజుల క్రితం అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra) బయలుదేరి వెళ్లిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja singh) కుటుంబం వెనుదిరిగింది. అమర్‌నాథ్‌లో మంచు శివ లింగాన్ని(shiv linga) దర్శించుకున్నట్లు రాజా సింగ్ చెప్పారు. మూడు రోజులుగా అమర్‌నాథ్ యాత్ర మార్గంలో వర్షాలు కురుస్తున్నాయని రాజా సింగ్ మీడియాకు చెప్పారు. పూర్తిగా వాతావరణం మారిపోయిందన్నారు. మూడు రోజులుగా అమర్‌నాథ్ యాత్ర మార్గంలో వర్షాలు కురుస్తున్నాయని రాజా సింగ్ మీడియాకు చెప్పారు. తాము హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణం కావాలని భావించామని చెప్పారు. కానీ, అననుకూల వాతావరణం నేపథ్యంలో గుర్రాలపై తిరుగు ప్రయాణమైనట్లు తెలిపారు.
#WATCH | Rescue operations are being carried out in cloudburst affected area at the lower Amarnath Cave site
A total of 10 Army rescue teams with Army Dogs continue rescue operations.
(Source: Northern Command, Indian Army) pic.twitter.com/NZlcu3BmdO
— ANI (@ANI) July 8, 2022
ఎమ్మెల్యే తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు అమర్‌నాథ్‌లో కుంభ వృష్టి కురుస్తున్నది. సహాయక చర్యలను ముమ్మరం చేశారు. క్షతగాత్రులను దవాఖానలకు తరలించామని జమ్ముకశ్మీర్ ఐజీపీ చెప్పారు. బురదలో చిక్కుకుని కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్న ముగ్గురు యాత్రికులను సహాయ సిబ్బంది వెలికి తీసి, హెలికాప్టర్‌లో దవాఖానకు తరలించారు.
కుంభవృష్టి వర్షం దాటికి 25 టెంట్లు కొట్టుకుపోయాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం ఆరు ఆర్మీ హెలికాప్టర్లలో సహాయ చర్యలు చేపట్టారు. పది ఆర్మీ టీమ్‌లు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీపీ జవాన్లు సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నారు. మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు అమర్ నాథ్ యాత్ర నిలిపేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jul 08, 2022 11:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

