Bihar Boat Capsized: ముజఫర్‌పూర్ జిల్లాలో ఘోర విషాదం, బాగమతి నదిలో 34 మంది విద్యార్థులో వెళుతున్న పడవ బోల్తా, 20 మందిని రక్షించిన పోలీసులు, మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థులతో బాగమతి నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది.పడవలో 34 మంది విద్యార్థులు ఉన్నారు.సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి 20 మందిని రక్షించినట్లు చెప్పారు

Bihar Boat Capsized: ముజఫర్‌పూర్ జిల్లాలో ఘోర విషాదం, బాగమతి నదిలో 34 మంది విద్యార్థులో వెళుతున్న పడవ బోల్తా, 20 మందిని రక్షించిన పోలీసులు, మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం
Bihar Boat Capsized (Photo-Video Grab)

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పాఠశాల విద్యార్థులతో బాగమతి నదిలో ప్రయాణిస్తున్న పడవ ప్రమాదవశాత్తు బోల్తాపడింది.పడవలో 34 మంది విద్యార్థులు ఉన్నారు.సహాయక బృందాలు హుటాహుటిన రంగంలోకి దిగి 20 మందిని రక్షించినట్లు చెప్పారు. మరో పద్నాలుగు మంది పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. బెనియాబాద్ ప్రాంతంలోని పట్టి ఘాట్‌ వద్ద ఈ ఘటన జరిగింది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై బిహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ..వెంటనే సహాయక చర్యలు కొనసాగించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఈ ప్రమాద ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు నది వద్దకు చేరుకుని విలపిస్తున్నారు. అటు.. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

Bihar Boat Capsized (Photo-Video Grab)

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Sep 14, 2023 06:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).