Boney Kapoor: బోనీ కపూర్ ఫ్యామిలీకి గోల్డెన్ ఆఫర్, ప్రత్యేక వీసా అందించిన యూఏఈ ప్రభుత్వం
పర్యాటక రంగానికి మరింత జోష్ ఇచ్చేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది యూఏఈ. రెగ్యులర్‌గా తమ దేశానికి వచ్చే ప్రముఖులకు గోల్డెన్ వీసాలను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఫ్యామిలీకి గోల్డెన్ వీసా అందించింది.
Dubai November 12: పర్యాటక రంగానికి మరింత జోష్ ఇచ్చేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది యూఏఈ. రెగ్యులర్‌గా తమ దేశానికి వచ్చే ప్రముఖులకు గోల్డెన్ వీసాలను అందిస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత బోనీకపూర్ ఫ్యామిలీకి గోల్డెన్ వీసా అందించింది.
2019 నుంచి ఈ గోల్డెన్ వీసాలు అందిస్తూ వస్తుండగా, కొద్ది రోజుల క్రితం నటి త్రిషని ఈ అదృష్టం వరించింది. యూఏఈ నుంచి గోల్డెన్ వీసా అందుకున్న తొలి నటిని తానే కావడం ఆనందంగా ఉందంటూ మురిసిపోయింది త్రిష.దుబాయ్ కు రెగ్యులర్ గా వచ్చే బోనీకపూర్ ఫ్యామిలీకి గోల్డెన్ వీసా అందించారు అధికారులు. ఈ సంవత్సరం బోనీకపూర్ తోపాటు తన నలుగురు పిల్లలకు ఈ వీసా మంజూరు చేసింది.
Thank you to Dubai Government for granting me and my 4 children Golden Visa on my Birthday @DXBMediaOffice pic.twitter.com/vlVn5x6Bm1
— Boney Kapoor (@BoneyKapoor) November 11, 2021
తన పుట్టినరోజు సందర్భంగా బోనీ కపూర్ కూతుళ్లు జాన్వీ ఖుషీ కపూర్ తో కలిసి వీసాలను అందుకున్నారు. దుబాయ్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా బోనీ కపూర్ ఫ్యామిలీ ధన్యవాదాలు తెలిపారు.
(The above story first appeared on LatestLY on Nov 12, 2021 10:24 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

