Representational Picture. (Photo credits: Pixabay)

Newdelhi, June 25: ఊపిరి కోసం పీల్చే గాలి, జీవక్రియల కోసం తాగే నీరు, మనుగడ కోసం తినే ఆహారం కల్తీ అయినట్టే, జబ్బుపడితే కోలుకోవడానికి వాడే మందులు కూడా నాసిరకాలుగానే ఉన్నాయి. ఇది నిజం. దేశంలోని ఫార్మా కంపెనీల్లో (Pharma Companies) తయారవుతున్న ఔషధాల నాణ్యతా ప్రమాణాలపై సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఎస్సీవో-CDSCO) ఇటీవల పరిశీలన జరిపింది. దేశవ్యాప్తంగా తయారవుతున్న ఔషధాల్లో నాణ్యతాప్రమాణాలను పాటించడం లేదని (Sub-Standard Quality Drugs) తేలింది. ప్రాణాలను కాపాడే 50కి పైగా ఔషధాలు నాసిరకంగా ఉన్నట్టు సీడీఎస్సీవో వెల్లడించింది. నాసిరకం ఔషధాల్లో 22కు పైగా మందులు హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఫార్మా కంపెనీల్లోనే తయారవుతున్నట్టు గుర్తించింది.

రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి AD 2898' మూవీ టీంకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్.. అదనపు షోలకు ప్రభుత్వం అనుమతి.. టికెట్ రేట్ల పెంపునకు కూడా గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలు ఇవిగో..!

నాసిరకమైన డ్రగ్స్ లో కొన్ని..

సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పులకు వాడే పారాసిటమాల్‌ 500 ఎంజీ, రక్తపోటును నియంత్రించే టెల్మిసార్టన్‌, దగ్గు సిరప్‌ కఫ్టిన్‌, నొప్పి నివారణకు వాడే డిక్లోఫెనాక్‌, మల్టీ విటమిన్‌ ట్యాబ్లెట్లు, కాల్షియమ్‌ గోలీలను నాసిరకంగా తయారుచేస్తున్నట్టు సీడీఎస్సీవో వివరించింది.

అంచ‌నాల‌ను అమాంతం పెంచిన క‌ల్కి రిలీజ్ ట్రైల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ మూవీ ట్రైల‌ర్ కు ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌డం ఖాయం