Hyderabad, June 25: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' (Kalki 2898 AD) కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్రప్రదేశ్ లో అదనపు షోలు నిర్వహించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని, టికెట్ రేట్లు పెంచాలని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ కోరికను మన్నించింది. తొలి రెండు వారాలు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
కల్కి సినిమా అదనపు షో లకు మరియు టిక్కెట్ల రేటు పెంపుకు అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ#Kalk #kalki2898ad #KALKI2898AD pic.twitter.com/k4JOWM3QkX
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2024
టికెట్ రేట్లు పెంపు కూడా
అలాగే టికెట్ రేట్లు కూడా పెంచింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్ లలో రూ.125 దాకా టికెట్ ధర పెరిగింది. పెరిగిన ధరల ఎఫెక్ట్ తొలి రెండు వారాలు ఉండనుంది. కాగా ఈ చిత్రం ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది.