Kalki 2898 AD (Credits: X)

Hyderabad, June 23: రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) సరికొత్త చిత్రం 'కల్కి AD 2898' (Kalki 2898 AD) కోసం యావత్తు దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. భారీ బడ్జెట్, తారాగణంతో తెరకెక్కిన కల్కి టీంకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణలో స్పెషల్‌ షోలు నిర్వహించుకునేందుకు ఈ నెల 27 నుంచి వచ్చేనెల 4 వరకు అనుమతులు ఇవ్వాలని, 27న బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ కోరికను మన్నించింది.

అంచ‌నాల‌ను అమాంతం పెంచిన క‌ల్కి రిలీజ్ ట్రైల‌ర్, సైన్స్ ఫిక్ష‌న్, యాక్ష‌న్ మూవీ ట్రైల‌ర్ కు ఒళ్లు గ‌గుర్పొడ‌వ‌డం ఖాయం

జూన్ 27న ఉదయం 5.30 గంటలకు బెనిఫిట్ షో

ఈ సినిమా బెనిఫిట్ షోలకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. జూన్ 27న ఉదయం 5.30 గంటలకు బెనిఫిట్ షో ఉండనుంది. ఇక తొలివారం రోజులకు 5 ఆటలు ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతి లభించింది. మరోవైపు ఈ సినిమాకు టికెట్ రేట్లు కూడా కాస్త పెరిగాయి. సింగిల్ స్క్రీన్​ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్​లలో రూ.100 దాకా టికెట్ ధర పెరిగింది. పెరిగిన ధరల ఎఫెక్ట్​ తొలి వారం రోజులు ఉండనుంది.

తెలంగాణకు వర్ష సూచన.. రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

టికెట్ రేట్లు వివరాలు.

బెనిఫిట్ షో (జూన్ 27)

  • సింగిల్ స్క్రీన్ థియేటర్- రూ.377
  • మల్టీప్లెక్స్ - రూ.495

రెగ్యులర్ షో

  • సింగిల్ స్క్రీన్ థియేటర్- రూ.265
  • మల్టీప్లెక్స్ - రూ.413