Hyderabad, OCT 03: పాన్ ఇండియా నటుడు ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి’ (Kalki). వైజయంతి మూవీస్ బ్యానర్‌లో వచ్చిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై సూపర్‌హిట్ అందుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులను సృష్టించింది. ఇదిలావుంటే ఈ సినిమాకు సీక్వెల్ ఉందని నాగ్ అశ్విన్ (Nag Ashwin) ప్రకటించిన విషయం తెలిసిందే. సీక్వెల్‌ను అయితే ప్రకటించారు కానీ ఎప్పుడు మొదలుపెట్టనున్నారు అనేది మాత్రం వెల్లడించలేదు.
Here's the Video Song
ఇదిలావుంటే ఈ మూవీ క్లైమాక్స్‌లో హైలైట్‌గా నిలిచిన ‘వీర ధీర’ (Veera Dheera) సాంగ్ ఫుల్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. వీర రణ రణ ధీర రా రా అంటూ సాగిన ఈ పాట గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. మహాభారత యుద్ధంలో అర్జునుడు కర్ణుడు ఎదురుపడినప్పుడు ఈ సాంగ్ రాగా.. కర్ణుడి పాత్రలో ప్రభాస్.. అర్జునుడి పాత్రలో విజయ దేవరకొండ నటించి అలరించారు.