Hyd, July 21: మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన విజువల్ వండర్ కల్కి 2898AD.జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర భాషల్లో కల్కి మూవీ సత్తాచాటింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్ల మైలురాయిని చేరుకుంది, సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
దేశీయంగానే కాదు విదేశాల్లోనూ కల్కి మూవీ సత్తాచాటింది.నార్త్ అమెరికాలో నాన్ బాహుబలి 2 రికార్డును బద్దలు కొట్టగా వైజయంతీ మూవీస్ ఈ సినిమాతో తొలిసారి వెయ్యికోట్ల క్లబ్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ అంతా ఆనందంలో ఉండగా అంతలోనే షాక్ తగిలింది.
ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఓ స్వామిజీ కల్కి నిర్మాతలకు, నటులకు నోటీసులు పంపారు. ఆచార్య ప్రమోద్ కృష్ణం, కల్కి నిర్మాతలతో పాటు నటులు అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌లకు లీగల్ నోటీసులు పంపారు. సనాతన గ్రంథాలను మార్చి హిందువుల మనోభావాలతో ఆడుకోవడం సినిమా వాళ్లకు అలవాటైపోయిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇకపై సనాతన గ్రంధాలను మార్చి కాలక్షేపం కోసం ఉపయోగిస్తే సహించేది లేదని ఆయన తేల్చిచెప్పారు. కల్కి నారాయణ భగవానుడి అవతారం అవతారం కానీ సినిమాలో వీళ్లకు ఇష్టం వచ్చినట్టు మార్చి తీశారని చెప్పారు హిందూ పురాణాలను ఇష్టమొచ్చినట్టు మార్చి సినిమా తీసినందుకు నటీనటులకు, నిర్మాతలకు నోటీసులు పంపినట్లు ప్రమోద్ తరపు న్యాయవాది వెల్లడించారు మరి ఈ నోటీసులకు కల్కి మేకర్స్, నటులు ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి.
ప్రభాస్‌తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్,కమల్ హాసన్,దిశా పటానీ, రాజమౌళి, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ తదితరులు నటించారు. భారత సినీ పరిశ్రమలో ఎవరికీ దక్కని ఘనత సాధించిన రామ్ చరణ్, తొలిసారి ఓ భారతీయ నటుడికి దక్కనున్న ప్రతిష్టాత్మక అవార్డు