Hyderabad, June 23: తెలంగాణలో (Telangana) నేడు, రేపు వానలు (Rains) పడనున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమ వారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో వ్యాపించి చాలాకాలమైనా ఇప్పటికీ మంచి వానలు లేకపోవడంతో తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉన్నది. ఈ క్రమంలో పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పడంతో అన్నదాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా...ఈ కూరగాయలతో డయాబెటిస్ కంట్రోల్ వుంటుంది...
శనివారం భారీ వర్షాలు
ఇక శనివారం తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో 13.1 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడాపూర్‌లో 4.7 నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో 4.4, సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో 4.2 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లోనూ పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...