Rahul Hands Over Official Bungalow: ఇళ్లు ఖాళీ చేసిన రాహుల్, అధికారిక నివాసం తాళాలు అప్పగింత, ఇకపై తల్లితోనే ఉంటానంటూ ప్రకటన
లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడడంతో ఎట్టకేలకు తన అధికారిక నివాసాన్ని కీలక నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ఖాళీ చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‌లో ఉన్న ఆ భవనంలో (Official Bungalow) రాహుల్ 2005 నుంచి ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది.
New Delhi, April 22: లోక్‌సభ సభ్యత్వంపై వేటు పడడంతో ఎట్టకేలకు తన అధికారిక నివాసాన్ని కీలక నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) ఖాళీ చేశారు. సెంట్రల్ ఢిల్లీలోని 12 తుగ్లక్ లేన్‌లో ఉన్న ఆ భవనంలో (Official Bungalow) రాహుల్ 2005 నుంచి ఉంటున్నారు. అయితే ఏప్రిల్ 22 లోగా ఖాళీ చేయాలని బీజేపీ ఎంపీ సీఆర్ పాటిల్ నేతృత్వంలోని లోక్‌సభ హౌసింగ్ కమిటీ నోటీసులు పంపింది. తాజాగా గడువు ముగియడంతో శనివారం తన బంగళాను రాహుల్ (Rahul Gandhi) ఖాళీ చేశారు. 18 ఏళ్ల పాటు ఆ బంగళాలో ఉన్న రాహుల్ గాంధీ.. మొదటి సారి అక్కడి నుంచి బయటికి వెళ్లారు. కాగా, తన బంగళాకు సంబంధించిన తాళాలను సోనియా గాంధీ (Sonia gandhi) , ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్ సమక్షంలో అధికారులకు రాహుల్ గాంధీ అప్పగించారు.
सच्चाई बोलने की कीमत है आज कल!
वो जो भी कीमत होगी, मैं चुकाता जाऊंगा। pic.twitter.com/1ZN6rbGFIu
— Rahul Gandhi (@RahulGandhi) April 22, 2023
అనంతరం రాహుల్ మాట్లాడుతూ తాను ఇక ఈ ఇంటిలో ఉండాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. భారత ప్రజలు తనకు 19 ఏళ్లుగా ఈ ఇంటిని ఇచ్చారని, అందుకు వారికి రాహుల్ కృతజ్ఞతలు తెలిపారు. తాను నిజాలు మాట్లాడినందుకు ప్రత్యర్థులు పన్నిన కుట్రను చెల్లించుకున్న మూల్యమని అన్నారు. అయితే ఎంత మూల్యమైనా చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఇకపై కూడా తాను నిజాలే మాట్లాడతానని రాహుల్ అన్నారు. కొంత కాలం పాటు తన తల్లి సోనియా గాంధీ నివాసంలో ఉంటానని రాహుల్ అన్నారు. ఇక ఈ విషయమై ప్రియాంక గాంధీ వాద్రా స్పందిస్తూ తాను ఏ ప్రభుత్వం వల్ల బాధపడుతున్నాడో ఆ ప్రభుత్వం గురించి నిజాలు మాట్లాడాడని అన్నారు. రాహుల్ గాంధీని మోదీ (Modi) ప్రభుత్వం, అమిత్ షా టార్గెట్ చేస్తున్న తీరు పూర్తిగా రాజకీయ కక్ష సాదింపు చర్యని మండిపడ్డారు.
అనర్హత వేటు పడిన ఎంపీకి ప్రభుత్వ వసతికి అర్హత ఉండదు. అయితే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడానికి ఒక నెల వ్యవధి ఉంటుంది. ఇక సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు చేసేందుకు 30 రోజులు గడువు ఇవ్వగా.. శుక్రవారం ఈ కేసులో రాహుల్ ఓడిపోయారు. దీంతో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం తిరిగి పొందలేకుండా పోయింది. ఇక దీనిపై గుజరాత్ హైకోర్టును కానీ సుప్రీంకోర్టును కానీ ఆశ్రయించేందుకు అవకాశం ఉంది. 2019 నాటి పరువు నష్టం కేసులో మోదీ ఇంటిపేరు ఉన్న వ్యక్తులు దొంగలు అంటూ ఎన్నికల ర్యాలీలో రాహుల్ వ్యాఖ్యానించడంపై నమోదైన కేసును విచారించిన గుజరాత్‌లోని సూరత్‌లోని కోర్టు, రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించబడింది. ఇక బంగళా ఖాళీ చేసిన రాహుల్ గాంధీకి తమ ఇంట్లో చోటు ఇస్తామంటే, తమ ఇంట్లో ఇస్తామంటూ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆఫర్లు చేశారు. అయితే రాహుల్ గాంధీ.. సెంట్రల్ ఢిల్లీలోని 10 జనపథ్‌లో ఉన్న తన తల్లి సోనియా గాంధీ బంగ్లాకు మారనున్నారు.
(The above story first appeared on LatestLY on Apr 22, 2023 09:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

