MLA Blows Flying Kiss To Speaker: స్పీకర్‌కి గాల్లో ముద్దులు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి, ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, కృతజ్ఙతతోనే ఇలా చేశానని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..

ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిషాలో అసెంబ్లీ సమావేశాలు(Odisha Assembly) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో స్పీకర్ ఎస్ఎన్ పాత్రో(Speaker Surjya Narayan Patro)కు చిత్రమైన అనుభవం ఎదురయింది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి (Congress MLA Taraprasad Bahinipati) తన నియోజక వర్గ సమస్యలను ప్రస్తావిస్తుండగా స్పీకర్ ఆయన్నిప్రశంసించారు.

MLA Blows Flying Kiss To Speaker: స్పీకర్‌కి గాల్లో ముద్దులు ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి, ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, కృతజ్ఙతతోనే ఇలా చేశానని చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే..
Congress MLA Blows Flying Kiss To Speaker In Odisha Assembly (Photo-Twitter)

Bhubaneswar, November 20: ఒడిషా అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఒడిషాలో అసెంబ్లీ సమావేశాలు(Odisha Assembly) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో స్పీకర్ ఎస్ఎన్ పాత్రో(Speaker Surjya Narayan Patro)కు చిత్రమైన అనుభవం ఎదురయింది. సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి (Congress MLA Taraprasad Bahinipati) తన నియోజక వర్గ సమస్యలను ప్రస్తావిస్తుండగా స్పీకర్ ఆయన్నిప్రశంసించారు.

దీనికి స్పందించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహినీపతి గాల్లోకి ముద్దులు (MLA Blows Flying Kiss To Speaker) విసిరారు. ఎమ్మెల్యే ఒక్కసారిగా ఇలా చేయడంతో అక్కడ నవ్వులు విరిసాయి. ఎమ్మెల్యేలు అంతా నవ్వులతో ఆయన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. అయితే మరికొందరు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు అభ్యంతరం వ్యక్తం చేయడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందించారు.

ఎమ్మెల్యే ప్లయింగ్ కిస్

ఇందులో వేరే ఉద్దేశం లేదని, తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకునేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని ఈ రోజు సమయం ఇవ్వటంతో కృతజ్ఙతతోనే ఇలా చేశానని ఆయన తెలిపారు. మొత్తం 147మంది ఎమ్మెల్యేలు సభలో ఉండగా.. తనకే మొదట మాట్లాడే అవకాశం స్పీకర్ కల్పించారని అందుకు మరోసారి ధన్యవాదాలు తెలిపారు. స్పీకర్ ని ఎక్కడా కించపరచలేదని తెలిపారు.

కాగా ఈ ఎమ్మెల్యే ఇంతకు ముందు కూడా తెలుగు పాటకు స్టెప్పులేస్తూ కెమెరాకు చిక్కారు. మెగాస్టార్ చిరంజీవి పాట గువ్వా గోరింకతో సాంగుకి ఆయన స్టెప్పులేశారు. ఈ వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది.

(The above story first appeared on LatestLY on Nov 20, 2019 03:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).