Coronavirus in SC: షాకింగ్ రిపోర్ట్..సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బందికి కరోనా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే కేసులు విచారణ, ఒక్క రోజే కోర్టులో 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా కల్లోలాన్ని రేపుతోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది (Coronavirus in SC) మహమ్మారి బారిన పడడం తాజాగా కలకలం రేపుతోంది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు.

Coronavirus in SC: షాకింగ్ రిపోర్ట్..సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బందికి కరోనా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే కేసులు విచారణ, ఒక్క రోజే కోర్టులో 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌
Supreme Court of India | Photo-IANS)

New Delhi, April 12: దేశంలో కరోనా కల్లోలాన్ని రేపుతోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో 50 శాతం సిబ్బంది (Coronavirus in SC) మహమ్మారి బారిన పడడం తాజాగా కలకలం రేపుతోంది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు కోర్టు రూముతోపాటు సుప్రీంకోర్టు ఆవరణ మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నారు. కోర్టులోని సగం మంది సిబ్బంది వైరస్ బారినపడటంతో ఇక మీదట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే కేసులను విచారించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు సమాచారం.

తాజా కోవిడ్‌ కలకలం నేపథ్యంలో కోర్టు బెంచ్‌లన్నీ నేడు ఓ గంట ఆలస్యంగా కేసుల విచారణను ప్రారంభించనున్నాయి. కాగా, శనివారం ఒక్క రోజే కోర్టులో 44 మంది సిబ్బంది కరోనా పాజిటివ్‌గా (Supreme Court Staff Test Positive) తేలింది. ‘‘నా సిబ్బందిలోని చాలామంది లా క్లర్కులు కరోనావైరస్ బారినపడ్డారు’’ అని ఓ న్యాయమూర్తి తెలిపారు. గతంలో కొంతమంది న్యాయమూర్తులు కరోనా బారినపడినా.. ఆ తర్వాత కోలుకున్నారు.

ఇండియాలో గత కొన్ని వారాలుగా వైరస్ (Covid in India) తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. గత వారం రోజుల్లో ఏకంగా పది లక్షల కేసులు వెలుగు చూశాయి. రోజువారీ కేసుల సంఖ్య వరుసగా ఆరో రోజు కూడా లక్ష మార్కును దాటింది. నేడు ఏకంగా 1,68,912 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన రోజువారీ కేసుల్లో ఇదే అత్యధికం. కోవిడ్‌ బారిన పడి 904 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఏప్రిల్‌ 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్‌, కరోనాను తరిమికొట్టాలని ప్రధాని పిలుపు, దేశంలో తాజాగా 904 మంది కరోనాతో మృతి, గత 24 గంటల్లో ,68,912 మందికి కోవిడ్ నిర్ధారణ

ప్రపంచంలో అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా ఇప్పుడు ఇండియా నిలిచింది. నిన్నటివరకు టాప్ 2లో ఉండే బ్రెజిల్ ఇప్పుడు టాప్ 3కి వెళ్లింది. ఇండియాలో గత వారం రోజుల్లో 10 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇవాళ వరుసగా ఆరో రోజు లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు లక్షన్నరకు పైగా కరోనా కేసులు వచ్చాయి. ఓవైపు కేంద్రం వ్యాక్సిన్ ఉత్సవ్ జరుపుకోమని సలహా ఇస్తే... మరోవైపు 11 రాష్ట్రాల్లో వ్యాక్సిన్లకు కొరత ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సమస్య ఉంది.

(The above story first appeared on LatestLY on Apr 12, 2021 12:15 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).