Uttarpradesh shocker: కూతురి దగ్గర ప్రెగ్నెన్సీ కిట్లు ఉన్నాయని చంపేసిన తల్లిదండ్రులు, గొంతకోసి, బ్యాటరీ యాసిడ్ పోసి కిరాతకంగా హత్య చేసిన దుర్మార్గులు, హత్యకు సహకరించిన బాబాయ్

ఈ నెల 3న యువతి తల్లిదండ్రులు నరేశ్‌, అతని భార్య శోభాదేవి ఇంట్లోనే కూతురు గొంతుకోసి హత్య చేసినట్లు ఎస్పీ బ్రిజేష్‌ కుమార్‌ శ్రీవాస్తవ బుధవారం తెలిపారు. మృతురాలి గుర్తింపును దాచేందుకు శరీరంపై బ్యాటరీలోని యాసిడ్‌ పోశారన్నారు (battery acid). మృతదేహాన్ని దాచేందుకు నరేశ్‌కు అతని సోదరులు రమేశ్‌, గులాబ్‌ సహకరించారన్నారు.

Uttarpradesh shocker: కూతురి దగ్గర ప్రెగ్నెన్సీ కిట్లు ఉన్నాయని చంపేసిన తల్లిదండ్రులు, గొంతకోసి, బ్యాటరీ యాసిడ్ పోసి కిరాతకంగా హత్య చేసిన దుర్మార్గులు, హత్యకు సహకరించిన బాబాయ్
Representational Image. (photo credit- IANS)

Koushambi, FEB 09: అనుమానంతో తల్లిదండ్రులు కన్న కూతురు (Couple kills daughter) గొంతుకోసి హత్య చేశారు. ఆచూకీ తెలియకుండా యాసిడ్‌ పోసి.. మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలమాబాద్‌కు (Alamabad ) చెందిన నరేశ్‌ (Naresh) ఈ నెల 3న తన కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే గ్రామ శివారులో ఉన్న కాలువలో యువతి మృతదేహాన్ని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రుల వ్యవహారంపై అనుమానం వచ్చిన పోలీసులు వారిని విచారించగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

Uttar Pradesh: కోర్టు ఆవరణలోకి చిరుతపులి, ఏడుమందిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలు, ఘజియాబాద్ జిల్లా కోర్టులో షాకింగ్ ఘటన, వీడియో ఇదే..  

ఈ నెల 3న యువతి తల్లిదండ్రులు నరేశ్‌, అతని భార్య శోభాదేవి ఇంట్లోనే కూతురు గొంతుకోసి హత్య చేసినట్లు ఎస్పీ బ్రిజేష్‌ కుమార్‌ శ్రీవాస్తవ బుధవారం తెలిపారు. మృతురాలి గుర్తింపును దాచేందుకు శరీరంపై బ్యాటరీలోని యాసిడ్‌ పోశారన్నారు (battery acid). మృతదేహాన్ని దాచేందుకు నరేశ్‌కు అతని సోదరులు రమేశ్‌, గులాబ్‌ సహకరించారన్నారు.

First Night Video on Social Media: లైకుల కోసం తెగించిన కొత్త జంట, ఏకంగా శోభనం వీడియోను ట్విట్టర్‌ లో పోస్టు చేసిన వధూవరులు, మేము ఎలా గడిపామో చూడండి అంటూ పోస్టు ఛీదరించుకుంటున్న నెటిజన్లు 

అయితే, యువతి తరుచూ ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుండేదని, దీంతో కూతురిపై అనుమానం భార్యాభర్తలకు అనుమానం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కూతురికి ఎవరితోనే సంబంధం ఉందని, అంతే కాకుండా యువతి నుంచి ప్రెగ్నెసీ టెస్ట్‌ కిట్లు (pregnancy test kits) దొరకడంతో అనుమానం పెరిగి హత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. హత్య కేసులో మొత్తం నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వివరించారు.

(The above story first appeared on LatestLY on Feb 09, 2023 10:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).