COVID-19 in India: భారతదేశంలో 2,301 కు ఎగబాకిన కోవిడ్-19 కేసులు, మరణించిన వారి సంఖ్య 56; ఇప్పటివరకు 156 మంది వైరస్ బారినపడి కోలుకున్నారని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ

కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా మహారాష్ట్రలో (Maharashtra) తరువాత కేరళను అధిగమించి తమిళనాడు రాష్ట్రంలో ఉంది. మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 420 దాటింది. ముఖ్యంలో ఆసియాలో అతిపెద్ద మురికివాడగా చెప్పబడే ముంబైలోని ధారావి ప్రాంతంలో ఇప్పటికే ముగ్గురికి కరోనావైరస్ సోకగా అందులో ఒకరు చనిపోయారు...

COVID-19 in India: భారతదేశంలో 2,301 కు ఎగబాకిన కోవిడ్-19 కేసులు, మరణించిన వారి సంఖ్య 56; ఇప్పటివరకు 156 మంది వైరస్ బారినపడి కోలుకున్నారని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
Coronavirus Outbreak in India | Photo: IANS

New Delhi, April 3: భారతదేశంలో కరోనావైరస్ (COVID-19 in India) కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 300 కి పైగా కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం భారతదేశంలో మొత్తం COVID-19 కేసుల సంఖ్య 2,301 కు చేరుకుంది. మరణాల సంఖ్య 56 కి పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 2,088 క్రియాశీల కరోనావైరస్ రోగులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు 156 మంది రోగులు ఈ వ్యాధి నుంచి కోలుకున్నట్లు వెల్లడించింది.

కరోనావైరస్ తీవ్రత ఎక్కువగా మహారాష్ట్రలో (Maharashtra) ఉంది. ఆ తరువాత కేరళను అధిగమించిన తమిళనాడు 309 కోవిడ్-19 కేసులతో జాబితాలో రెండో స్థానంలోకి వచ్చింది.

మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 420 దాటింది. ముఖ్యంగా ఆసియాలో అతిపెద్ద మురికివాడగా చెప్పబడే ముంబైలోని ధారావి ప్రాంతంలో ఇప్పటికే ముగ్గురికి కరోనావైరస్ సోకగా అందులో ఒకరు చనిపోయారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలలో ఒకటిగా చెప్పబడే ధారావిలో కరోనావైరస్ వ్యాప్తి మరియు నియంత్రణ చర్యలు చేపట్టడం మహారాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సవాలుతో కూడుకొన్న పని.

Check the status by ANI:

ఇటీవల కాలంలో దిల్లీ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్లు అకస్మాత్తుగా పెరిగాయి. తమిళనాడు రాష్ట్రంలో కోవిడ్-19 కేసులు 309కి చేరాయి, కేరళ మరియు దిల్లీలో కూడా కేసులు 300కు చేరువయ్యాయి. తబ్లిఘి జమాత్‌కు హాజరైన విదేశీయులను బ్లాక్‌లిస్ట్ చేసిన కేంద్ర హోంశాఖ, నిబంధనలు ఉల్లంఘించిన వారందరిపై చర్యలకు ఆదేశం

గత నెలలో దిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన ఒక మత సమ్మేళనం ద్వారానే తాజా కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. దిల్లీ కార్యక్రమానికి హాజరైన వారు మరియు వారి పరిచయాలకు అనుసంధానించబడిన 9,000 మందిని అధికారులు గుర్తించి , వారందరినీ క్వారైంటైన్ కేంద్రాలకు తరలించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

(The above story first appeared on LatestLY on Apr 03, 2020 12:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).