Persons Who Participated in Tablighi Jamaat Event Quarantined. (Photo Credits: ANI)

New Delhi, April 3: నిబంధనలు ఉల్లంఘించి నిజాముద్దీన్ (Nizamuddin) తబ్లిఘి జమాత్ (Tablighi Jamaat) సమ్మేళనంలో  పాల్గొన్న 960 మంది విదేశీయుల వీసాలను రద్దు (Visa Cancel) చేయడంతో పాటు వారిని బ్లాక్ లిస్ట్ (blacklist) లో చేర్చింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA). అంతేకాకుండా ఈ రకంగా నిబంధనలు అతిక్రమించి పట్టుబడిన విదేశీయులందరిపై విదేశీయుల చట్టం 1946 మరియు విపత్తు నిర్వహణ చట్టం 2005 ( Disaster Management Act, 2005.) లోని సెక్షన్ల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దిల్లీ కమీషనర్‌కు అలాగే దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత కమీషనరేట్లకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.

సౌత్ దిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్‌‌లో కరోనావైరస్ లక్షణాలు కలిగి ఉండి కూడా మతపరమైన సమ్మేళనంకు హాజరైన సుమారు 1,300 మంది అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాలకు చెందిన  విదేశీ తబ్లిఘి జమాత్ కార్యకర్తలు ఆ సమ్మేళనంలో పాల్గొనడమే కాకుండా ఆ తదనంతరం దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించారు. ఈ ఒక్క చర్యనే ఇప్పుడు భారతదేశంలో కరోనావైరస్ వ్యాప్తికి కారణమైంది.

Here's the update by ANI

నిజాముద్దీన్ వెస్ట్‌లోని తబ్లిఘి జమాత్ నిర్వహించిన మర్కజ్ సెంటర్ ఇప్పుడు దేశంలో కరోనావైరస్ యొక్క హాట్‌స్పాట్‌గా అవతరించింది. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని పూర్తిగా మూసివేశారు. దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి సమావేశం నిర్వహించినందుకు దాని మతాధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. లాక్‌డౌన్ నిబంధనలు మరింత కఠినతరం, అతిక్రమించిన వారికి రెండేళ్ల జైలు శిక్ష

ఈ ఒక్క కేంద్రం నుండి మొదలైన కరోనావైరస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సుమారు 20 రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించబడింది. మర్కజ్ తో సంబంధం ఉన్న సుమారు 9,000 మంది భారతీయ తబ్లిఘి జమాత్ సభ్యులను మరియు వారి సన్నిహితులను ఆయా రాష్ట్రాలకు చెందిన అధికారిక బృందాలు గుర్తించి వారందరినీ క్వారంటైన్ కేంద్రాలకు తరలించే పనిలో నిమగ్నమయ్యారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నమోదవుతున్న కేసులు మరియు ఇప్పటివరకు నమోదైన 12 కరోనా మరణాలు మొత్తం ఈ సమావేశంతో లింక్ ఉన్నవే అని తేలింది.