Dahra Global Case: ఖతర్‌లో ఉరిశిక్ష పడిన ఆ 8 మంది భారతీయులకు ఊరట, మరణశిక్షను జైలు శిక్షగా మార్చిన ఖతర్ కోర్టు

ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన కేసులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారుల (Former Indian Navy personnel)కు ఖతర్‌ (Qatar)లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఖతర్‌ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.

Dahra Global Case: ఖతర్‌లో ఉరిశిక్ష పడిన ఆ 8 మంది భారతీయులకు ఊరట, మరణశిక్షను జైలు శిక్షగా మార్చిన ఖతర్ కోర్టు
Qatar-Flag

ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలకు సంబంధించిన Dahra Global Case కేసులో భారత్‌కు చెందిన ఎనిమిది మంది నౌకాదళ మాజీ అధికారుల (Former Indian Navy personnel)కు ఖతర్‌ (Qatar)లో మరణశిక్ష పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఖతర్‌ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. మరణశిక్ష (Death Sentence)ను రద్దు చేస్తూ వారికి శిక్షను తగ్గించి జైలు శిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఖతర్‌ కోర్టు తీర్పును భారత విదేశాంగ శాఖ (MEA) ఓ ప్రకటనలో వెల్లడించింది.

అయితే, వారికి ఎన్నేళ్ల శిక్ష విధించారన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. తీర్పునకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై ఖతర్‌ అధికారులతో చర్చిస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ కేసులో తదుపరి చర్యలు చేపట్టేందుకు న్యాయ బృందంతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

Here's ANI Tweet

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 28, 2023 04:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).