Delhi Excise Policy Case: వరుసగా ఆరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని ఆప్ స్పష్టం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఈడీ విచారకు డుమ్మా కొట్టారు.ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన నేడు కూడా విచారణకు హాజరుకాలేదు.
- Read in
- తెలుగు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోసారి ఈడీ విచారకు డుమ్మా కొట్టారు.ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందు హాజరుకావాల్సిందిగా ఈ నెల 14న కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఆయన నేడు కూడా విచారణకు హాజరుకాలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉన్న సమయంలో సమన్లు పంపడం చట్టు విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఈడీ మళ్లీ మళ్లీ సమన్లు పంపడం చట్ట విరుద్ధమని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈడీ వేచిచూడాల్సిందే అని పేర్కొంది.
ఈడీ పంపిన సమన్లకు అరవింద్ కేజ్రీవాల్ స్పందించకపోవడంతో దర్యాప్తు సంస్థ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణను కోర్టు మార్చి 16కు వాయిదా వేసింది. కాగా కేజ్రీవాల్‌ను గతంలో ఐదుసార్లు నవంబర్ 2, నవంబర్ 21, జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2న హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కానీ ఈడీ పంపిన సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని ఆరోపిస్తూ కేజ్రీవాల్ విచారణకు హాజరుకాలేదు.
Here's ANI News
Delhi CM Arvind Kejriwal will not appear before ED today. ED summons are illegal. The matter of the validity of the ED summons is now in court. Instead of sending summons again and again, ED should wait for the court's decision: Aam Aadmi Party
(file pic) pic.twitter.com/8ixqav0Dbe
— ANI (@ANI) February 19, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 19, 2024 12:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

