Fresh Summons to Arvind Kejriwal: మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు, 16వ తేదీ తమ ముందు హాజరు కావాలని ఆదేశాలు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (money laundering case)లో ఢిల్లీ సీఎంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate ) అధికారులు ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరుకావాలని కోరితే ఈడీ సమన్లు కేజ్రీ పట్టించుకోలేదు.
- Read in
- తెలుగు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) ఢిల్లీ కోర్టు (Delhi court ) సమన్లు జారీ చేసింది. మార్చి 16న తమ ముందు హాజరుకావాలని కేజ్రీవాల్‌ను కోర్టు ఆదేశించింది.ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసు (money laundering case)లో ఢిల్లీ సీఎంకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate ) అధికారులు ఇప్పటికే 8 సార్లు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. విచారణకు హాజరుకావాలని కోరితే ఈడీ సమన్లు కేజ్రీ పట్టించుకోలేదు. వరుసగా ఆరోసారి ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోర్టు నిర్ణయం వచ్చే వరకు వేచి చూడాలని ఆప్ స్పష్టం
ఈ నేపథ్యంలోనే ఈడీ బుధవారం కోర్టును ఆశ్రయించింది.సమన్లు జారీ చేసినా ఆయన విచారణకు హాజరుకావడం లేదని తెలిపింది. ఈ అంశంపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు పంపింది.మద్యం కుంభకోణంలో విచారణకు కేజ్రీవాల్ ఇప్పటికే అంగీకరించిన విషయం తెలిసిందే. మార్చి 12 తర్వాత కొత్త తేదిని ఇవ్వాలని కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకానున్నట్లు తెలిపారు.
Here's ANI News
Rouse Avenue Court in Delhi issues fresh summons to Delhi Chief Minister Arvind Kejriwal on ED's second complaint for allegedly not complying with the summons in the alleged Delhi liquor policy money laundering case.
He is directed to appear on March 16.
(File photo) pic.twitter.com/o5ViUt1pW2
— ANI (@ANI) March 7, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Mar 07, 2024 11:34 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

