Delhi Shocker: చిన్న గొడవ, విద్యార్థిని క్లాస్ రూంలోనే కత్తితో పొడిచి చంపిన 5 మంది విద్యార్థులు, నిందితులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలుడిని అతని ఐదుగురు సహవిద్యార్థులు కత్తితో పొడిచి ( Class X Student Stabbed ) చంపారు. పదో తరగతి విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Delhi Shocker: చిన్న గొడవ, విద్యార్థిని క్లాస్ రూంలోనే కత్తితో పొడిచి చంపిన 5 మంది విద్యార్థులు, నిందితులను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Delhi, Sep 30: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్‌ ఘటన వెలుగు చూసింది. 17 ఏళ్ల బాలుడిని అతని ఐదుగురు సహవిద్యార్థులు కత్తితో పొడిచి ( Class X Student Stabbed ) చంపారు. పదో తరగతి విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడిని దీపాంశుగా గుర్తించారు. విద్యార్థి హత్యపై డిప్యూటీ కమిషనర్‌(వాయవ్య) ఉషా రంగ్నాని వివరాలు వెల్లడించారు

పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్‌ 29న ఆదర్శ్ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు విద్యార్థిని కొంత మంది విద్యార్థులు ( Five Classmates) కత్తులతో పొడిచినట్లు ఫోన్‌ వచ్చింది. ఆ వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని ఐపీసీ సెక్షన్‌ 302 (హత్య), 307 (హత్యాయత్నం), 34 (సాధారణ ఉద్దేశం) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులతో బాధితుడు గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ పగతో దీపాన్షును బటన్‌ నైఫ్‌తో పొడిచి హత్య చేశారు.

యూపీలో ఆస్పత్రిలో దారుణం, మహిళను రూంకి పిలిచి ముగ్గురు వైద్యులు గ్యాంగ్ రేప్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఆ ఆయుధాన్ని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు (Probe Underway) తెలిపారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. లాల్‌ బాఘ్‌, ఆజాద్‌పుర్‌ ప్రాంతాలకు చెందిన ఐదుగురు జువైనల్‌లను ఘటన జరిగిన రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

 

(The above story first appeared on LatestLY on Sep 30, 2022 08:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).