
Basti, Sep 30: యూపీలో బస్తీ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు వైద్యులు కలిసి ఓ మహిళను రేప్ చేసిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. ఓ బస్తీలోని ఆస్పత్రికి చెందిన వైద్యుడు... లఖ్‌నవూకు చెందిన ఓ మహిళను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు.
ఆమెను తన ఆస్పత్రికి పిలిచాడు. ఆగస్టు 10న వచ్చిన ఆమెను.. తన హాస్టల్ రూముకు తీసుకెళ్లాడు. అక్కడే తన ఇద్దరు సహచర వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి (woman's rape im basti) ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసు సూపరింటెండెంట్ ఆశిష్ శ్రీవాస్తవ ఆదేశాల మేరకు సదర్ కొత్వాలి వద్ద కేసు (Case registered against three doctors) నమోదు చేయబడింది.
మరో ఘటనలో యూపీలోని కస్‌గంజ్ జిల్లాలో బహిర్భూమికి వెళ్లిన మహిళ ఆదివారం తెల్లవారుజామున పొలంలో విగతజీవిగా పడిఉండటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వివాహిత బహిర్భూమికి వెళ్లిన సమయంలో కొందరు ఆమె దుపట్టాతో ఊపిరి ఆడకుండా చేసి ఉసురు తీశారు. ఆపై మృతదేహాన్ని నీటి కుంటలో పడేసి పరారయ్యారు.
ఎంతసేపటికి మహిళ ఇంటికి తిరిగిరాకపోవడంతో బాధితురాలి భర్త, కటుంబసభ్యులు ఆమె కోసం గాలించగా నీటికుంటలో మృతదేహం కనిపించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. బాధితురాలిని ఊపిరాడకుండా చేసి చంపేశారని, పోస్ట్‌మార్టం అనంతరం పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని చెప్పారు.