Jaipur, Sep 30: రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై 8 మంది సామూహిక లైంగిక దాడికి ( Minor gang-raped by 8 men) పాల్పడి ఆపై రూ 50,000 చెల్లించకుంటే వీడియో వైరల్ చేస్తామని బ్లాక్‌మెయిల్ చేశారు. నిందితులంతా దాదాపు 20 ఏండ్ల వయసు వారేనని పోలీసులు తెలిపారు.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. కిషన్‌గఢ్ బస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏండ్ల బాలిక ప్రైవేట్ ఫోటోలను సేకరించిన నిందితుడు రూ 50,000 ఇవ్వాలని లేకుంటే వాటిని ( video made viral) బహిర్గతం చేస్తానని బెదిరించాడు. ఆపై ప్రధాన నిందితుడు సహా ఎనిమిది మంది బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక సోదరుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
గత ఏడాది డిసెంబర్ 31న ప్రధాన నిందితుడు సాహిల్ పధకం ప్రకారం బాలికను (Minor) నిర్జన ప్రదేశానికి పిలిపించాడు. బాలిక రాగానే ఎనిమిది మంది నిందితులు ఆమె దుస్తులు తొలగించి లైంగిక వేధింపులకు గురి చేసి నేరాన్ని కెమెరాలో రికార్డు చేశారు. ఆపై బాలికను బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలికను రూ 50,000 చెల్లించాలని బెదిరించగా డబ్బు ఇవ్వకపోవడంతో నిందితులను వీడియోను స్ధానిక సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.