Delhi Railway Job Fraud: వామ్మో ఇదెక్కడి మోసం బాబోయ్! ట్రైన్ బోగీలు లెక్కపెట్టడమే ఉద్యోగం, ట్రైనింగ్ పేరుతో ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో నెల రోజుల పాటూ ఫేక్ ట్రైనింగ్, జాబ్స్ పేరుతో రూ. 2.67 కోట్లు ముంచిన రిటైర్డ్ ఆర్మీ మేజర్, దారుణంగా మోసపోయిన 28 మంది యువకులు
రోజుకు 8 గంటల పని (ప్రభుత్వ ఉద్యోగం అంటే అంతేగా మరి స్టేషన్‌కు ఎన్ని రైళ్లు వస్తున్నాయో (Delhi railway fraud).. ఎన్ని వెళ్తున్నాయో.. వాటికి బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టే ఉద్యోగం అంటూ ఆ ఉద్యోగాలకు పేర్లు కూడా పెట్టాడు. టీటీఈ, క్లర్క్‌ల (TTE) ఉద్యోగాలు అంటూ మోసం చేశాడు. ఆ ఉద్యోగాలకు ట్రైనింగ్ అంటూ ఢిల్లీ స్టేషన్ లో నెల రోజులు కూర్చోపెట్టారు
New Delhi, DEC 21: ‘వచ్చే పోయే రైళ్లను లెక్కపెట్టే ఉద్యోగం..ఆ రైళ్లకు బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టే ఉద్యోగం’ ఉంది మీరు ‘ఉ’అంటే చాలు ఉద్యోగం ఇప్పించేస్తా..చక్కటి జీతం పైగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం (Govt Job) వస్తుంది అంటూ మీరు నమ్ముతారా? నమ్మకపోవచ్చు. కానీ చదువుకుని ఉద్యోగం లేక..తల్లిదండ్రులకు భారంగా బతుకీడుస్తున్న నిరుద్యోగులు మాత్రం ఉద్యోగం ఇప్పిస్తాం అంటే చాలు నమ్మేస్తారు. నమ్మేసి డబ్బులు పోగొట్టుకుంటారు. ఆ తరువాత మోసపోయామని తెలిసి ఆవేదన చెందుతారు. మోసపోయేవారు (recruitment fraud) ఉన్నంత కాలం మోసం చేసేవారు ఉంటారనే ఓ మాట అక్షరాల మరోసారి నిజమైంది.. ‘వచ్చే పోయే రైళ్లను లెక్కపెట్టే ఉద్యోగం..ఆ రైళ్లకు బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టే ఉద్యోగం’అని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడో కేటుగాడు. అతని వలలో కొంతమంది నిరుద్యోగులు చిక్కుకోవటమే కాదు..పిచ్చివాళ్లైపోయారు. సదరు మోసగాడి మాటలు నమ్మి డబ్బులు సమర్పించుకోవటమే కాదు దారుణంగా దగాపడ్డారు. సదరు వ్యక్తి చెప్పిన మాట విని 28 మందిని నిరుద్యోగులు ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో (Delhi Railway Station) వచ్చే పోయే రైళ్లను లెక్కబెడుతూ. ఆ రైళ్లకు ఎన్ని బోగీలు ఉన్నాయో లెక్కబెడుతుకూ కూర్చున్నారు. అలా ఒకరోజు రెండు రోజులుకాదు ఇదో ట్రైనింగ్ అని చెప్పి 28మంది నిరుద్యోగులకు ఢిల్లీ రైల్వే స్టేషన్ లో కూర్చోపెట్టాడా కేటుగాడు. అతని చెప్పిన మాటలు నమ్మి వచ్చే పోయే రైళ్లను రైళ్ల బోగీలను లెక్కపెడుతు కూర్చున్నారు నిరుద్యోగులు..!!
రోజుకు 8 గంటల పని (ప్రభుత్వ ఉద్యోగం అంటే అంతేగా మరి స్టేషన్‌కు ఎన్ని రైళ్లు వస్తున్నాయో (Delhi railway fraud).. ఎన్ని వెళ్తున్నాయో.. వాటికి బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టే ఉద్యోగం అంటూ ఆ ఉద్యోగాలకు పేర్లు కూడా పెట్టాడు. టీటీఈ, క్లర్క్‌ల (TTE) ఉద్యోగాలు అంటూ మోసం చేశాడు. ఆ ఉద్యోగాలకు ట్రైనింగ్ అంటూ ఢిల్లీ స్టేషన్ లో నెల రోజులు కూర్చోపెట్టారు. ఈ నెల రోజుల తరువాత మీరు జాబ్ లో జాయిన్ అయిపోవచ్చని నమ్మించాడు. అలా రైల్వేల్లో ఉద్యోగాల పేరుతో ఓ గ్యాంగ్ 28 మందిని నెల రోజుల పాటు ట్రైనింగ్ పేరుతో (fake training) ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో బోగీలు లెక్కపెట్టటానికి కూర్చోపెట్టారు. ఉద్యోగాలు రావాలంటే డబ్బులు లంచంగా ఇవ్వాలని చెప్పి నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.2.67కోట్లు వసూలు చేసింగా గ్యాంగ్. కానీ పిచ్చి వాళ్లలాగా నెల రోజుల పాటు స్టేషన్ కు వచ్చే పోయే రైళ్లను లెక్కపెట్టిన తరువాత సదరు గ్యాంగ్ పత్తా లేకుండాపోయేసరికి మోసపోయామని తెలుసుకుని లబోదిబోమన్నారు.
తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బుసామి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తరువాత ఢిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌లో శివరామన్ అనే కొయంబత్తూరుకు చెందిన వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని..రైల్వేల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీకు తెలిసినవారుంటే చెప్పండీ ఇప్పిస్తాను అని సుబ్బుసామిని నమ్మించాడు. శివరామన్ మాటలు నమ్మిన సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను ఢిల్లీకి తీసుకొచ్చి శివరామన్ కు పరిచయం చేశారు. ఫలానా వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడని మదురైలోని చాలా మందికి తెలిసింది. అలా మరో 25మంది సుబ్బుసామిని కలిసి మాక్కూడా ఉద్యోగం ఇప్పించండీ సార్ అని బతిమాలుకున్నారు. దీంతో సుబ్బుసామి ఆ 25మందిని కూడా ఢిల్లీ తీసుకెళ్లారు.
(The above story first appeared on LatestLY on Dec 21, 2022 10:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

