Dog Attack in UP: పాపం చిన్నారులు, నిద్ర పోతుండగా నోట కరుచుకుని వెళ్లిన కుక్క, దానికి తోడుగా మరిన్ని కుక్కలు దాడి చేయడంతో యూపీలో ఇద్దరు పిల్లలు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్, మొరాదాబాద్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులను కుక్కలు కరిచి చంపేశాయి. అలీఘర్‌లో, ఆదివారం నాడు చిన్నారి కుటుంబ సభ్యులు తమ ఇంటి సమీపంలో ఒక వివాహానికి హాజరైన సమయంలో పాపను ఇంట్లో నిద్రపుచ్చి వెళ్లారు.
Lucknow, April 24: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్, మొరాదాబాద్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులను కుక్కలు కరిచి చంపేశాయి. అలీఘర్‌లో, ఆదివారం నాడు చిన్నారి కుటుంబ సభ్యులు తమ ఇంటి సమీపంలో ఒక వివాహానికి హాజరైన సమయంలో పాపను ఇంట్లో నిద్రపుచ్చి వెళ్లారు. నిద్రిస్తున్న సమయంలో మూడు నెలల పసికందును వీధికుక్క నోట కరచుకొని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లింది. చిన్నారిపై అక్కడ ఉన్న అన్ని కుక్కలు దాడి చేసి శరీర భాగాలను చీల్చి తీవ్రంగా గాయపర్చాయి.
దీంతో ఆ చిన్నారి మృతిచెందింది. క్వార్సీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.రెండవ సంఘటనలో, మొరాదాబాద్‌లోని బిలారి ప్రాంతంలో ఆదివారం కూడా ఏడేళ్ల బాలుడిని వీధికుక్కలు కొరికి చంపాయి. సవేంద్ర కుమార్ అనే బాలుడు తన తండ్రికి టీ అందించడానికి తన సోదరితో కలిసి బయటకు వెళ్లినప్పుడు కుక్కలు దాడి చేశాయి.
(The above story first appeared on LatestLY on Apr 24, 2023 03:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

