Manmohan Singh Last Rites On Saturday: శనివారం మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు.. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకం సగానికి అవనతం

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూశారు. ఆయన అంతిమ సంస్కారాలను శనివారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు.

Manmohan Singh Last Rites On Saturday: శనివారం మన్మోహన్‌ సింగ్‌ అంత్యక్రియలు.. ఏడు రోజులు సంతాపదినాలు.. ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకం సగానికి అవనతం
Former prime minister Manmohan Singh (File Image)

Newdelhi, Dec 27: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ (Manmohan Singh) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమ సంస్కారాలను (Last Rites) శనివారం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని అంత్యక్రియలను పూర్తి అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఆయన మృతికి సంతాప సూచకంగా 7 రోజుల సంతాప దినాలను ప్రకటించింది.

మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

జెండా సగానికి అవనతం

రాష్ట్రపతి భవన్‌ సహా అన్ని ప్రభుత్వ భవనాలపై జాతీయ పతాకాన్ని సగానికి అవనతం చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రిమండలి సమావేశమై ఆయన మృతికి సంతాపం తెలుపనుంది.

మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ మ‌ర‌ణం.. విద్యాసంస్థ‌లు, ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు నేడు సెల‌వు ప్ర‌క‌టించిన తెలంగాణ ప్ర‌భుత్వం.. వారం రోజుల‌పాటు రాష్ట్ర‌వ్యాప్తంగా సంతాప దినాలు

(The above story first appeared on LatestLY on Dec 27, 2024 09:57 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).