Manmohan Singh-Telangana: మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం అరవై ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం జరిగినప్పటికీ, అప్పటి ప్రధాని మన్మోహనుడి ప్రభుత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది.
Hyderabad, Dec 27: తెలంగాణ (Telangana) రాష్ట్ర ఏర్పాటుకోసం అరవై ఏండ్లపాటు సుదీర్ఘ పోరాటం జరిగినప్పటికీ, అప్పటి ప్రధాని మన్మోహనుడి (Manmohan Singh) ప్రభుత్వంలోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరిగింది. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఒకవిధంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నెరవేర్చారని రాజకీయ విశ్లేషకులు గుర్తుచేసుకుంటున్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 ప్రకటన వెలువడింది. తెలంగాణ ఏర్పాటును కాంగ్రెస్ పార్టీకి చెందిన అప్పటి సమైక్యవాదులు, నేతలు, ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర కేబినెట్ లో ఉన్న ఆయా నేతలు రాజీనామా చేస్తామని బెదిరించారు. అయినప్పటికీ మన్మోహన్ సింగ్ వెనక్కి తగ్గలేదు. తెలంగాణను ఏర్పాటు చేస్తూ ధీరోదాత్త ప్రకటన చేయించారు.
తెలంగాణ కోసం ప్రత్యేక సూచనలు
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామని యూపీఏ ప్రభుత్వం డిసెంబర్ 9న చేసిన ప్రకటనను త్రిమూర్తుల కూర్పుగా చెప్పుంటారు. ప్రకటన చేసింది నాటి హోంమంత్రి చిదంబరమే అయినా.. కేసీఆర్ కు, మన్మోహన్ సింగ్ కు మధ్య వారధిగా జయశంకర్ సార్ ఉన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మద్దతు కూడగట్టడంలో కేసీఆర్ కు మన్మోహన్ సింగ్ తగిన సూచనలు చేసినట్టు చెప్తారు. అలా తెలంగాణ సాకారమైంది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన రాజకీయ దురంధరుడు
(The above story first appeared on LatestLY on Dec 27, 2024 09:18 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

