EPF Interest: ఈపీఎఫ్‌ఓ ఖాతాలో వడ్డీ మిస్, క్లారిటీ ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా ఈ సమస్య తలెత్తిందని వెల్లడి
ఈపీఎఫ్‌ఓ ఖాతాలో వడ్డీ (EPF Interest) మొత్తం కనిపించడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం (finance ministry clarifies) చేసింది.
New Delhi, Oct 6: ఈపీఎఫ్‌ఓ ఖాతాలో వడ్డీ (EPF Interest) మొత్తం కనిపించడంలేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ స్పందించింది. సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ కారణంగా ఈ వడ్డీ మొత్తం స్టేట్‌మెంట్‌లో కనిపించడం లేదని కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం (finance ministry clarifies) చేసింది. ఈపీఎఫ్‌ఓ సంస్థ ప్రతి ఆర్ధిక సంవత్సరానికి ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకు వడ్డీ ఎంత చెల్లించేది నిర్ణయిస్తుంది. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత సంబంధిత ఖాతాలో ఆ వడ్డీని జమ చేస్తుంది.
ఎప్పటిలాగే 2020-2021 ఆర్ధిక సంవత్సరానికి 8.5 శాతం వడ్డీని చెల్లించినట్లు మార్చి 2021లో ప్రకటించింది. అదే ఏడాది డిసెంబర్ నెలలో లబ్ధి దారుల అకౌంట్‌లలో (EPF account) డిపాజిట్ అయ్యింది. 2021-22 సంబంధించి ఈపీఎఫ్ బోర్డు వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించింది. కానీ ఇప్పటి వరకు అకౌంట్‌లో జమ కాలేదు.ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ పీఎఫ్ వడ్డీ ఎక్కడ? అంటూ ట్వీట్ చేశారు.
Here's Tweet
There is no loss of interest for any subscriber.
The interest is being credited in the accounts of all EPF subscribers. However, that is not visible in the statements in view of a software upgrade being implemented by EPFO to account for change in the tax incidence. (1/2) https://t.co/HoY0JtPjII
— Ministry of Finance (@FinMinIndia) October 5, 2022
ఆ ట్వీట్‌పై ఆర్థిక మంత్రిత్వ శాఖ..పీఎఫ్ ఖాతాలో రూ.2.5 లక్షల మించి జమ చేస్తే..ఆ మొత్తంపై లభించే వడ్డీకి పన్ను విధిస్తామని గతంలో పేర్కొన్నాం. దానికి సంబంధించి సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడేషన్ జరుగుతుండటంతో ఆలస్యం అవుతోందని, వడ్డీ మొత్తాన్ని ఏ ఒక్క చందాదారుడూ కోల్పోరని తన ట్వీట్‌లో స్పష్టం చేసింది.
(The above story first appeared on LatestLY on Oct 06, 2022 08:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

