Farmers Protest: చట్టాలు రద్దు చేయాల్సిందే, ఫిబ్రవరి 1న పార్లమెంట్ మార్చ్ తలపెట్టిన రైతు సంఘాలు, వివిధ ప్రాంతాల నుండి కాలి నడక ద్వారా పార్లమెంట్ వద్ద నిరసన, డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పిన రైతులు

వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో ట్రాక్లర్ల ర్యాలీ కేంద్రానికి తెలియజేసిన రైతులు తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పించబడిన రోజు ఫిబ్రవరి 1 న వివిధ ప్రాంతాల నుండి పార్లమెంటు మార్చ్ (Farmer Leaders Announce March) నిర్వహిస్తామని నిరసన చేస్తున్న రైతు సంఘాలు సోమవారం ప్రకటించాయి.

Farmers Protest: చట్టాలు రద్దు చేయాల్సిందే, ఫిబ్రవరి 1న పార్లమెంట్ మార్చ్ తలపెట్టిన రైతు సంఘాలు, వివిధ ప్రాంతాల నుండి కాలి నడక ద్వారా పార్లమెంట్ వద్ద నిరసన, డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని తేల్చి చెప్పిన రైతులు
Heavy Security at Tikri Border (Photo Credits: ANI)

New Delhi, January 27: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో ట్రాక్లర్ల ర్యాలీ కేంద్రానికి తెలియజేసిన రైతులు తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పించబడిన రోజు ఫిబ్రవరి 1 న వివిధ ప్రాంతాల నుండి పార్లమెంటు మార్చ్ (Farmer Leaders Announce March) నిర్వహిస్తామని నిరసన చేస్తున్న రైతు సంఘాలు సోమవారం ప్రకటించాయి. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు దానికే కట్టుబడి ఉన్నామని క్రాంతికారి కిసాన్ యూనియన్‌కు చెందిన దర్శన్ పాల్ అన్నారు. వారి డిమాండ్లన్నీ నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుందని ఆయన అన్నారు.

ఫిబ్రవరి 1 న బడ్జెట్ రోజున (Budget Day 2021) వివిధ ప్రాంతాల నుండి కాలినడకన పార్లమెంటు వైపు వెళ్తాము "అని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఉద్యమం జరిగినట్లే ఈ పాదయాత్ర శాంతియుతంగా కొనసాగుతుందని ఆయన పునరుద్ఘాటించారు.“ట్రాక్టర్ పరేడ్ కోసం వచ్చిన రైతులు ఇప్పుడు వెనక్కి వెళ్లరు. తరువాత నిరసనలో (Parliament March) పాల్గొంటారు. మా డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన కొనసాగుతుంది. మా వైఖరి అలాగే ఉంది, ”అని పాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, నిరసనను తీవ్రతరం చేయడానికి రైతుల ప్రణాళికలను పంచుకున్నారు.

గత ఏడాది సెప్టెంబర్‌లో అమల్లోకి వచ్చిన ఈ మూడు వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగంలో ప్రధాన సంస్కరణలుగా దళారి వ్యవస్థను తొలగించి, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా విక్రయించడానికి వీలు కల్పిస్తాయి. అయితే ఈ చట్టాలు కార్పోరేట్ వ్యవసాయానికి బాటలు పరుస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యుద్ధభూమిగా మారిన ఢిల్లీ, 154 మంది పోలీసులకు గాయాలు, 15 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు, ఎంత మంది రైతులు గాయ‌ప‌డ్డారో ఇంకా తెలియని వైనం, హింసాత్మకంగా మారిన రైతుల కిసాన్ పరేడ్

ఇదిలా ఉంటే గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని నగరం రణరంగమైంది. రైతులు సృష్టించిన బీభ‌త్సం వ‌ల్ల సుమారు 153 మంది పోలీసులు గాయ‌ప‌డ్డారు. చాలా చోట్ల ప‌బ్లిక్ ప్రాప‌ర్టీ ధ్వంస‌మైంది. ట్రాక్ట‌ర్ల‌తో రైతులు ర్యాలీ తీసిన ఘ‌ట‌న‌లో ఢిల్లీ పోలీసులు మొత్తం 15 ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేశారు. ఇందులో 5 కేసులు తూర్పు ఢిల్లీ పరిధిలో నమోదయ్యాయి. కాగా, ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీలో (Farmers rally) ఉద్రిక్తతతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

సోన్‌పట్‌, పాల్వాల్‌, ఝజ్జర్‌ జిల్లాల్లో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. సాయంత్రం 5 గంటలవరకు ఇంటర్‌నెట్‌, ఎస్‌ఎంఎస్‌‌ సర్వీసులు రద్దుచేశారు. శాంతిభద్రతలకు ఆటంకం కలుగకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. 72వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున పంజాబీ, హ‌ర్యానా రైతులు.. కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలో ట్రాక్ట‌ర్ల‌తో ర్యాలీ (Farmers' Tractor Rally) తీసిన విష‌యం తెలిసిందే.

అయితే ప్రశాంతంగా సాగుతుందనుకున్న ర్యాలీ కాస్తా హింసాత్మకంగా (Republic Day Violence) మారింది. ట్రాక్ట‌ర్ల‌తో న‌గ‌రంలోకి దూసుకువ‌చ్చిన రైతులు భారీ హింస సృష్టించారు. ఎర్ర‌కోట‌పై ఏకంగా జెండాల‌ను పాతారు రైతులు. అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎంత మంది రైతులు గాయ‌ప‌డ్డారో ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. కానీ 153 మంది పోలీసులు మాత్రం గాయ‌ప‌డిన‌ట్లు అధికారులు తెలిపారు. ఎక్కువ శాతం మంది ఎర్ర‌కోట వ‌ద్దే గాయ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశరాజధానిలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతుల ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా నిన్న ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు.

(The above story first appeared on LatestLY on Jan 27, 2021 11:11 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).