Pune Shocker: బట్టలు విప్పి ఆటో డ్రైవర్ వెంటపడ్డ యువకుడు, ముంబైలో మహిళా డ్రైవర్‌ను వేధించిన వ్యక్తి, తనతో శృంగారం చేయాలంటూ తరిమిన ఆగంతకుడు

తనతో శృంగారంలో పాల్గొవాలంటూ (demanding sex) ఆ మహిళను నిఖిల్‌ ఒత్తిడి చేశాడు. భయపడిన ఆమె అక్కడి నుంచి పరుగున వెళ్తుండగా అనుసరించాడు. బట్టలు విప్పి నగ్నంగా మారి ఆ మహిళ వెంటపడ్డాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న ఆమె చివరకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు నిఖిల్‌ కోసం వెతికి గురువారం అరెస్ట్‌ చేశారు.

Pune Shocker: బట్టలు విప్పి ఆటో డ్రైవర్ వెంటపడ్డ యువకుడు, ముంబైలో మహిళా డ్రైవర్‌ను వేధించిన వ్యక్తి, తనతో శృంగారం చేయాలంటూ తరిమిన ఆగంతకుడు
Sexual Harassment. Representational Image | (Photo Credits: PTI)

Pune, DEC 30: మహిళా ఆటో డ్రైవర్‌ను (Female autorickshaw driver) ఒక ప్రయాణికుడు నగ్నంగా వెంబడించాడు. తనతో శృంగారం చేయాలని డిమాండ్‌ చేశాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. హడాప్సర్ (Hadapsar) ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల నిఖిల్ అశోక్ మెమజడే, సోమవారం రాత్రి మగర్‌పట్టా నుంచి కాట్రాజ్ ఘాట్‌కు (Katraj Ghat) వెళ్లేందుకు మహిళ నడుపుతున్న ఆటో ఎక్కాడు. రాత్రి పది గంటలకు కాట్రాజ్‌ ప్రాంతానికి చేరిన తర్వాత అక్కడ ఓ హోటల్‌ ముందు ఆటోను ఆపించాడు. ఆ తర్వాత తనతో కలిసి భోజనం చేయాలంటూ మహిళా ఆటో డ్రైవర్‌ను అడిగాడు. ఆమె నిరాకరించగా చెంపపై కొట్టాడు.

Tamil Nadu: వీళ్లు మనుషులేనా, దళితులు తాగే నీటి ట్యాంకులో మానవ మలమూత్రాలు, ఆ నీళ్లు తాగి తీవ్ర అనారోగ్యానికి గురైన పిల్ల‌లు, తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి 

ఆ తర్వాత తనతో శృంగారంలో పాల్గొవాలంటూ (demanding sex) ఆ మహిళను నిఖిల్‌ ఒత్తిడి చేశాడు. భయపడిన ఆమె అక్కడి నుంచి పరుగున వెళ్తుండగా అనుసరించాడు. బట్టలు విప్పి నగ్నంగా మారి ఆ మహిళ వెంటపడ్డాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న ఆమె చివరకు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు నిఖిల్‌ కోసం వెతికి గురువారం అరెస్ట్‌ చేశారు.

(The above story first appeared on LatestLY on Dec 30, 2022 11:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).