Water Tank (Photo-Wikimedia Commons)

Chennai, Dec 29: తమిళనాడులో కుల వివక్ష మరోమారు తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలోని పుడుకొట్ట‌యి జిల్లాలో కొంత మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ద‌ళితుల‌కు స‌ర‌ఫ‌రా చేసే నీటి ట్యాంకులో అధిక మొత్తంలో మాన‌వ మ‌లాన్ని (Human feces found in water tank) ప‌డేసారు. పుడుకొట్ట‌యి జిల్లాలోని ఇర‌యూర్ గ్రామంలో ఈ దారుణ ఘటన (Tamil Nadu Shocker) చోటు చేసుకుంది. ఆ గ్రామంలో 100 మంది ద‌ళితులు (Dalits) ఉన్నారు.

తమిళనాడులో దారుణం, కులం పేరుతో విద్యార్థిని దూషించి మంటల్లోకి తోసేసిన మరికొందరు విద్యార్థులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థి

అయితే చాలా మంది పిల్ల‌లు ఇటీవ‌ల తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో చిన్నారుల‌ను ఆస్ప‌త్రికి తీసుకెళ్ల‌గా వైద్యులు చికిత్స అందించారు. అయిన‌ప్ప‌టికీ పిల్ల‌ల‌కు వాంతులు, విరేచ‌నాలు త‌గ్గ‌డం లేదు. క‌లుషిత‌మైన నీటిని తాగ‌డం వ‌ల్లే ఇలా జ‌రిగి ఉండొచ్చ‌ని, ఒక‌సారి ట్యాంక్‌ను ప‌రిశీలించాల‌ని గ్రామ‌స్తుల‌కు వైద్యులు సూచించారు.

పోలీసులంటే ఇలా ఉండాలి, కోడలిని ఇంట్లోకి రానివ్వనందుకు బుల్డోజర్‌తో ఇంటిని కూల్చేందుకే ప్రయత్నించిన పోలీసులు, దెబ్బకు తలుపులు తీసి కోడలిని ఇంట్లోకి తీసుకువెళ్లిన అత్తింటివారు

దీంతో గ్రామ‌స్తుల్లో ఒక‌రు.. 10 వేల లీట‌ర్ల కెపాసిటీ ఉన్న వాట‌ర్ ట్యాంక్‌ను ప‌రిశీలించాడు. ఆ ట్యాంక్‌లో అధిక మొత్తంలో మాన‌వ మ‌లం ఉన్న‌ట్లు గుర్తించారు. షాకైన ద‌ళితులు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఇక జిల్లా క‌లెక్ట‌ర్ క‌విత రాము, జిల్లా పోలీసు చీఫ్ వందిత పాండే ఇర‌యూర్ గ్రామానికి చేరుకుని ప‌రిస్థితిని స‌మీక్షించారు.త‌మ‌కు జ‌రుగుతున్న అవ‌మానాల‌పై క‌లెక్ట‌ర్, పోలీసు ఉన్న‌తాధికారులకు ద‌ళితులు ఫిర్యాదు చేశారు. ఇప్ప‌టికీ గ్రామంలో త‌మ ప‌ట్ల వివ‌క్ష (villagers allege caste discrimination) కొన‌సాగుతుంద‌ని తెలిపారు.

మీ కులం పిచ్చి తగలెయ్యా! తక్కువ కులం డాక్టర్ పోస్టుమార్టం చేశాడని అంత్యక్రియలకు దూరంగా ఉన్న గ్రామం, బైక్‌ మీద తీసుకెళ్లి అంత్యక్రియలు చేసిన సర్పంచ్, మృతుడి భార్య గర్భంతో ఉందనే కనికరం కూడా చూపని బంధువులు

చాయ్ దుకాణంలో రెండు గ్లాసుల ప‌ద్ధ‌తి కొన‌సాగుతోంద‌ని వాపోయారు. గుడిలోకి అనుమ‌తి లేద‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో అధికారులు, పోలీసులు క‌లిసి అగ్ర కుల‌స్తుల‌తో స‌మావేశం ఏర్పాటు చేసి, ద‌ళితుల‌ను గుడిలోకి వెళ్లేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే ట్యాంక్‌లో పెద్ద మొత్తంలో మాన‌వ మ‌లాన్ని ప‌డేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు స్ప‌ష్టం చేశారు. ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వారు ఎవ‌రైనా స‌రే వ‌దిలిపెట్ట‌మ‌ని హెచ్చ‌రించారు.