Hubli Murder Case: పెళ్లాం కాపురానికి రాలేదని మామను చంపిన వైద్యుడు, అడ్డు వచ్చిన అత్త, భార్యకు గాయాలు, కర్ణాటకలోని హుబ్లీలో దారుణ ఘటన, నిందితుడు అరెస్ట్
భార్య కాపురానికి రాలేదని ఓ భర్త ఆమె ఫ్యామిలీపై కత్తితో దాడి (Hubli Murder) చేసాడు, ఈ దాడిలో దాడిచేసిన వ్యక్తి మామ చనిపోగా అత్తకు భార్యకు గాయాలయ్యాయి.
Hubballi, Oct 27: భార్య కాపురానికి రాలేదని ఓ భర్త ఆమె ఫ్యామిలీపై కత్తితో దాడి (Hubli Murder) చేసాడు, ఈ దాడిలో దాడిచేసిన వ్యక్తి యొక్క మామ చనిపోగా అత్తకు భార్యకు గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన కర్ణాటకలోని హుబ్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హుబ్లీ నగరంలో శంకర్ ముసన్నవర్ అనే వ్యక్తి న్యాయ విశ్వవిద్యాలయం ప్రిన్సిపల్‌గా (Former law college principal) ఇటీవల రిటైరయ్యారు. ఈయన హుబ్లీ లింగరాజునగర్లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు.
శనివారం ఉదయం వాకింగ్ వెళ్లడానికి సిద్ధమవుతుండగా అల్లుడు సంతోష్ చొరబడి కత్తితో విచ్చలవిడిగా దాడిచేశాడు. కత్తిపోట్లతో శంకర్ అక్కడికక్కడే మరణించగా ఆయన భార్య, కుమార్తె లతకు గాయాలయ్యాయి. అరుపులతో అప్రమత్తమైన స్థానికులు ఉన్మాది సంతోష్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
భార్య కాపురానికి రాలేదని ఉన్మాదిగా మారిన వ్యక్తి ఓ వైద్యుడు. అతని భార్య కూడా వైద్యరాలే.. కాగా వీరిద్దరి మధ్య గొడవలే ఈ ఘోరానికి కారణమని తెలిసింది. వీరిద్దరూ గొడవల వల్ల గత కొంత కాలం నుంచి వేరువేరుగా ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా. లతా హుబ్లీలో తండ్రి ఇంట్లో నివసిస్తూ ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తోంది.
దంత వైద్యుడైన సంతోష్ భార్యను తన వద్దకు పంపాలని అప్పుడప్పుడు మామ ఇంటికి వచ్చి ఘర్షణ పడేవాడు. ఎవరూ తన మాట వినడం లేదని చివరకు దారుణానికి ఒడిగట్టాడు. ఘటనాస్థలాన్ని పోలీస్ కమిషన్ లాబురామ్ పరిశీలించారు. నిందితున్ని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Oct 27, 2020 02:02 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

