Gujarat Honey Trapping: బట్టలిప్పింది, రూ. 1.25 లక్షలు కాజేసింది, హానీ ట్రాప్‌ వలలో చిక్కుకుని మోసపోయిన గుజరాత్ వైద్యుడు, ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Honeytrap (Photo-IANS)

Ahmedabad, Oct 24: గుజరాత్ రాష్ట్రం అహహ్మదాబాద్ నగరంలో ఓ వైద్యుడు హానీ ట్రాప్ వలలో (Gujarat Honey Trapping) చిక్కుకుని దారుణంగా మోసపోయాడు. మహిళలు పెట్టిన ఉచ్చులో బిగుసుకున్న ఓ వైద్యుడు ఏకంగా లక్షా ఇరవై వేల రూపాయలు సమర్పించుకున్నాడు. చికిత్స పేరుతో వైద్యుడికి ఎర వేసి రంగంలోకి దిగిన ఓ మహిళ, నకిలీ పోలీసులు రంగప్రవేశం చేసేలా నాటకమాడి ఆ వైద్యుడి (Gang honeytraps doctor) నుంచి రూ.1.25 లక్షలు కాజేశారు. కొత్త రకం హానీ ట్రాప్ భాగోతం గుజరాత్ ఖేడా జిల్లా (Gujarat Kheda) జరిగింది.

తన భర్త ఆనారోగ్యంతో ఉన్నాడని, క్లినిక్ వచ్చేలా లేనందున ఇంటికి వచ్చి చూడాలని ఓ మహిళ.. నాడియాడ్ సివిల్ దవాఖాన వైద్యుడిని కోరింది. దాంతో వైద్యుడు మరో మాట మాట్లాడకుండా ఆమె వెంట వెళ్లాడు. అయితే ఇంటికి వెళ్లగానే సదరు మహిళ తన ఒంటిపై ఉన్న దుస్తులు తీసేసింది. ఈ సమయంలో రంగప్రవేశం చేసిన పోలీసు దుస్తుల్లోని ముగ్గురు వ్యక్తులు.. రోగి బంధువులపై అఘాయిత్యానికి పాల్పడుతున్నావా? అంటూ బెదిరించారు. అతడిని ఆమెతో కలిపి కొన్ని అసభ్యకర ఫొటోలు తీసుకున్నారు.

నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు, వ‌స్త్ర వ్యాపారిని నిండా ముంచిన కేసులో ఫేక్ ఐపీఎస్‌ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు

అనంతరం వైద్యుడిపై కేసు పెడుతున్నామని చెప్పి స్టేషన్ కు రావాల్సిందిగా ఆదేశించారు. దాంతో భయపడిపోయిన సదరు వైద్యుడు.. తనకే పాపం తెలియదని వేడుకున్న వినిపించుకోలేదు. రూ.5 లక్షలు ఇస్తే వదిలేస్తామని చెప్పి ఆయన నుంచి రూ.1.25 లక్షలు వసూలు చేశారు. అనంతరం బాధిత వైద్యుడు పెట్‌లాండ్ పట్టణ పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు. పోలీసులు, ఫిర్యాదును స్వీకరించిన వెంటనే, చర్యలు తీసుకొని, ప్రఫుల్లా దర్జీ, అఖ్రోజ్‌బాను, సయ్యద్, షాకు చావ్దా, ఈశ్వర్ పటేల్, ధీరేంద్ర సోలంకి, గిరీష్ సోలంకి అనే ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఆనంద్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అజిత్ రాజియన్ తెలిపారు.