Fake IPS Officer Arrested: నకిలీ ఐపీఎస్‌ అధికారి అరెస్టు, వ‌స్త్ర వ్యాపారిని నిండా ముంచిన కేసులో ఫేక్ ఐపీఎస్‌ను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
Fake-IPS-officer-Shiv-Shankar-Sharma

Mumbai, October 10: త‌న‌ను తాను ఒక‌ ఐపీఎస్ అధికారిగా ప‌రిచ‌యం చేసుకుని సూరత్ వ‌స్త్ర వ్యాపారిని నిండా ముంచిన కేసులో బెంగ‌ళూరుకు చెందిన నకిలీ ఐపీఎస్‌ను (Fake IPS Officer Arrested) ముంబై పోలీసులు (Mumbai Police) అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం అత‌డిని కోర్టులో హాజ‌రుప‌ర్చి రిమాండ్‌కు త‌ర‌లించారు. ఇటీవ‌ల సూర‌త్‌కు చెందిన ఒక వ‌స్త్ర వ్యాపారిని క‌లిసి త‌న‌ను తాను ఐపీఎస్ అధికారిగా ఈ న‌కిలీ ఐపీఎస్ ప‌రిచ‌యం చేసుకున్నాడు. తన ద‌గ్గ‌ర ఇంపోర్టెడ్ వ‌స్త్రాలు ఉన్నాయ‌ని, ఇప్పుడే ముంబై నుంచి బ‌య‌లుదేరిన ఓ షిప్‌లో ఆ వ‌స్త్రాలు సూర‌త్‌కు వ‌స్తున్నాయ‌ని చెప్పాడు.

ఆ ఇంపోర్టెడ్ వ‌స్త్రాల‌కు సంబంధించి డీల్ మాట్లాడుకుందామ‌ని సూర‌త్ ప‌ట్ట‌ణానికి తీసుకెళ్లాడు. అక్క‌డే వ్యాపారిని కిడ్నాప్ చేసి ఓ గ‌దిలో బంధించాడు. అత‌ని నుంచి రూ.15 ల‌క్ష‌ల న‌గ‌దు (Rs 15 Lakh From Surat Businessman), ఒక ఐఫోన్‌, ఒక యాపిల్ వాచ్ లాక్కుని పోరిపోయాడు. వ్యాపారి ఫిర్యాదు మేర‌కు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేప‌ట్టి అదుపులోకి తీసుకున్నారు.

వర్మ దిశ మూవీని దయచేసి ఆపండి, హైకోర్టు గడప తొక్కిన దిశ తండ్రి, కేంద్ర ప్రభుత్వం, సెన్సార్ బోర్డు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు, దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ లైంగిక దాడి ఘ‌ట‌న

ఇక ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌లా గొంతుమార్చి మాట్లాడుతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని హన్వాడకు చెందిన ప్రధాన నిందితుడు అక్కపల్లి చంద్రశేఖర్ అలియాస్ చందు, గండీడ్ మండలం నంచర్లకు చెందిన దొమ్మరి రవి, నాగర్‌కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచకు చెందిన మాదాసు బాలయ్య, మాదాసు తేజ కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారు. ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ గొంతును అనుకరించి మాట్లాడుతూ గత 9 నెలలుగా వివిధ ప్రాంతాల్లో మోసాలకు పాల్పడ్డారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి పలువురి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశారు. జడ్చర్లకు చెందిన ఓ బాధితుడు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగం ఇప్పిస్తానని తన నుంచి రూ. 6.5 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆయన ఆరోపించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిన్న మహబూబ్‌నగర్ శివారులోని అప్పన్నపల్లి బ్రిడ్జి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇప్పటి వరకు ఇలా 12 మంది నుంచి రూ. 28 లక్షలు వసూలు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రెండు బైక్‌లు, రెండు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.