Jana Sena Party launches probe into allegations of extortion against Kiran Royal (Photo-X)

Vjy, Feb 9: తిరుపతి నియోజకవర్గ జనసేన (Jana Sena Party)ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ కాన్‌ఫ్లిక్ట్‌ కమిటీని ఆదేశించారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్‌ రాయల్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మేరకు పవన్‌ కల్యాణ్‌ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్‌ ప్రకటన విడుదల చేశారు.

చట్టానికి ఎవరూ అతీతులు కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. సమాజానికి ప్రయోజనం లేని విషయాలను పక్కన పెట్టి ప్రజలకు ఉపయోగపడే అంశాలపై దృష్టి సారించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పవన్‌ కల్యాణ్‌ సూచించినట్లు ఆయన పేర్కొన్నారు.

దారుణం, ఇంట్లో పని చేస్తున్న దివ్యాంగురాలిపై టీడీపీ నేత పదే పదే అత్యాచారం, గర్భం దాల్చిన బాధితురాలు, న్యాయం చేయాలని డిమాండ్

కాగా తనను ప్రేమించి, నమ్మించి తన నుంచి రూ.1.30 కోట్ల నగదు, 30 సవర్ల బంగారాన్ని కాజేశాడని (Kiran Royal Extortion Case) తిరుపతి రూరల్‌ మండలం చిగురువాడకు చెందిన లక్ష్మీరెడ్డి.. కిరణ్‌రాయల్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన మొదటి వీడియోను శనివారం ఆమె విడుదల చేశారు. ఆ వీడియోలో నువ్వే నా వైఫ్‌.. కైపు.. నైఫ్‌.. అంటూ లక్ష్మీతో కిరణ్‌రాయల్‌ చెప్పడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Kiran Royal Extortion Case:

అయితే ఈ వీడియో బయటకు రావడంతో నన్ను రోడ్డుపాల్జేసిన నిన్ను చంపేస్తా.. నాలుగు రోజుల్లో బెయిల్‌పై బయటకొస్తా.. నీ వల్ల ఏమైతే అది చేసుకో.. నువ్వు నా వెంట్రుక కూడా పీకలేవు. నీకు దిక్కున్న చోట చెప్పుకో.. నీ కొడుకులు పెద్దవాళ్లయ్యారని విర్రవీగొద్దు.. వాళ్ల కాళ్లు విరిచేస్తా..’ అంటూ జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జి కిరణ్‌రాయల్‌ లక్ష్మికి ఫోన్‌ చేసి తీవ్ర దుర్భాషలాడారు. దీనికి సంబంధించిన ఆడియో కూడా వెలుగులోకి వచ్చింది.

Kiran Royal Audio Leak

Kiran Royal Private Video Leak

Jana Sena Party launches probe into allegations of extortion against Kiran Royal

ఈ నేపథ్యంలో కిరణ్‌రాయల్‌ తనతో ప్రైవేటుగా ఉన్న వీడియో క్లిపింగ్‌ను ఆమె ఆదివారం తెల్లవారు జామున మీడియాకు విడుదల చేసింది. వారిద్దరూ బెడ్‌పై ఏకాంతంగా ఉన్న వీడియో అది. ఆ వీడి­యోలో లక్ష్మి తన వద్ద ఉన్న బంగారు ఆభరణాన్ని కిరణ్‌రాయల్‌ మెడలో వేసింది. ఈ వీడియో కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజాగా కిరణ్ రాయల్ పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్ డేటాను తస్కరించి తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తిరుపతి అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం కిరణ్ రాయల్ మాట్లాడుతూ, వైసీపీ నేతలు బెదిరింపులతో తన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ తన సోషల్ మీడియా ఖాతాలతో దుష్ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా పోలీసులకు తెలియజేశానని వివరించారు. ఎప్పుడో పదేళ్ల కిందట సమసిపోయిన వ్యవహారాన్ని ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని, దీని వెనుక వైసీపీ నేతలు ఉన్నారని మండిపడ్డారు. దీనిపై కోర్టులో రిట్ పిటిషన్ వేయబోతున్నానని వెల్లడించారు. తన ఫోన్ కేసు హైకోర్టులో ఉందని వెల్లడించారు.